*చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షావోమి మరో టీవీని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4X సిరీస్‌లో 65, 50, 43 అంగుళాల టీవీలను విడుదల చేసిన ఆ కంపెనీ తాజాగా 55 అంగుళాల ఎంఐ టీవీ 4X 2020 ఎడిషన్ 4k హెచ్‌డీఆర్ టీవీని తీసుకొచ్చింది
*జీవిత బీమా రంగంలో తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) వాటా పెరిగింది. 2019 మార్చి 31నాటికి తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో ఎల్‌ఐసీ వాటా 66.24 శాతం ఉంటే.. సెప్టెంబరునాటికి 73 శాతానికి చేరిందని ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ టీసీ సుశీల్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని జోనల్ కార్యాలయంలో దక్షిణ మధ్య ప్రాంత డెవల్‌పమెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడారు. పాలసీలపరంగా 2019 అక్టోబరులో ఎల్‌ఐసీ వాటా 78 శాతం ఉందన్నారు
*పీర్ టు పీర్ రుణాలకు వేదికగా ఉన్న ఆక్సీలోన్స్ కొత్త తరం రుణాలను అందించే వెసులుబాటు కల్పిస్తోంది. ఐటీ రంగంలో కొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాల సాధించడం తప్పనిసరి అయింది. డేటా అనలిటిక్స్, ఐఓటీ, బ్లాక్‌చైన్, మెషిన్ లెర్నింగ్‌వంటి డీప్ టెక్నాలజీల్లో శిక్షణకు రూ.2 లక్షలు అంతకు మించి ఖర్చవుతోంది
*పీపుల్స్ కంబైన్ గ్రూప్‌నకు చెందిన ఓఐ ప్లే స్కూల్స్‌ను ఫస్ట్‌క్రైకి చెందిన ఎడ్యుబీ ఎడ్యుకేషన్ సొంతం చేసుకుంది. లోఈస్ట్రో అడ్వైజర్స్ ఈ వ్యవహారానికి ఫైనాన్షియల్ సలహాదారుగా ఉందని పీపుల్స్ కంబైన్ గ్రూప్ చైర్మన్ తుమ్మల నాగ ప్రసాద్ తెలిపారు. బేబీ, కిడ్స్ ఉత్పత్తులకు ఆసియాలో ఫస్ట్‌క్రై అతిపెద్ద ఆన్‌లైన్ స్టోర్.
*ఆర్థిక మంత్రి హోదాలో తాను ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న తీరును నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించుకున్నారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యుపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ తీరుతో నేటి తీరును సరిపోల్చుతూ ప్రస్తుతం వృద్ధిరేటు మందగించి ఉండవచ్చు తప్పితే తిరోగమనంలోకి జారుకునే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు.
*కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఇదివరకెన్నడూ అనుమతించని కార్యకలాపాలకు పాల్పడిందని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి అన్నారు. క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై గత వారం సెబీ ఆంక్షలు విధించింది.
*కార్వీ అక్రమాలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) సెబీని నివేదిక కోరనుంది. ఈ బ్రోకింగ్ కార్పొరేట్ పాలన ప్రమాణాల ఉల్లంఘనకూ పాల్పడిందా అని పరిశీలించేందుకే సెబీని వివరాలు కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సెబీ నిషేధం ఎదుర్కొంటున్న కార్వీకి.. ఎంసీఏ కూడా దర్యాప్తు ప్రారంభిస్తే ఇబ్బందులు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి.
*పౌల్ట్రీకి రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హామీ ఇచ్చారు. బుధవారంనాడిక్కడ పౌల్ట్రీకి ఇండియా ఎక్స్‌పో 2019ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌల్ట్రీకి పరిశ్రమ ద్వారా దాదాపు రూ. 12,000 కోట్ల ఆదాయం సమకూరుతోందన్నారు. ఈ ఆదాయం రాష్ట్ర జీడీపీని ప్రభావితం చేస్తుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పౌల్ట్రీకి పరిశ్రమపై సుమారు 6.50 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. పౌల్ట్రీకి రైతులకు కూడా గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఎంఐ నుంచి 4k టీవీ..ధరెంతంటే?-వాణిజ్యం-11/28
Related tags :