Business

₹10లక్షల కోట్ల విలువ

₹10లక్షల కోట్ల విలువ-Reliance Industries Vaulated At 10Lakhs Crores

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారత వ్యాపార చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. 10లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ విలువను దాటిన తొలి భారతీయ కంపెనీగా చరిత్రకెక్కింది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ షేరు ఇవాళ్టి ట్రేడింగ్‌లో 1శాతం పెరిగి 15 వందల 81 రూపాయల 60 పైసలకు చేరింది. ఈ ఒక్క ఏడాదే షేరు ధర 40 శాతం పెరగడం విశేషం. అత్యధిక లాభాలు, టెలికాం టారీఫ్‌ల పెంపు, గ్యాస్‌ ఉత్పత్తి మొదలవ్వడం కంపెనీ షేర్‌ను లాభదాయకంగా మార్చింది. రిలయన్స్‌.. అక్టోబర్‌ 18న 9 లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ విలువకు చేరుకుంది. ఈ వారం చివరికి వచ్చేసరికి 10 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటింది. రిలయన్స్‌ తర్వాతి స్థానంలో ఉన్న టీసీఎస్‌కు మార్కెట్‌ విలువలో దాదాపు 2లక్షల కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. దీంతో రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్ య‌జ‌మాని ముఖేశ్ అంబానీ ప్ర‌పంచంలో 12వ కుబేరుడిగా మారారు. ఆసియాలోనే అత్యంత సంప‌న్నుడిగా అవ‌త‌రించారు. ఆయ‌న సంప‌ద 60.7 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ది.