1.పేదల చదువుకు ఎంతఖర్చయినా భరిస్తాం: జగన్‌పేద విద్యార్ధుల చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. మహత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. శంకుస్థాపన స్థలం వద్ద ప్రణమిల్లిన బాబుఏపీ రాజధాని అమరావతి పర్యటనలో ఉన్న చంద్రబాబు..ఉద్దండరాయుడిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక రైతులు, మహిళలు పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. రాజధాని నిర్మాణం ఆపడం అంటే.. 33వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను అవమానించడమే అని వారు పేర్కొన్నారు. అనంతరం వారందరితో కలిసి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లి.. అక్కడ చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు.
3. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న ఉద్ధవ్
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు కీలక బాధ్యతల నుంచి ఉద్ధవ్ తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతలను వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అప్పగించారు.
4. ‘ప్రజ్ఞా కూడా ఉగ్రవాదే’: రాహుల్
గాడ్సే దేశభక్తుడంటూ భాజపా ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ప్రజ్ఞా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఉగ్రవాది ప్రజ్ఞా.. ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తుడని అన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇదో దుర్దినం’ అని రాహుల్ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్, భాజపా మనసులోని మాటే ఆమె నోటి నుంచి వచ్చిందని, ఆమెపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేయడం అంటే సమయం వృథా చేసుకోవడమేనని దుయ్యబట్టారు.
5. హోటల్ వద్దని ఎయిర్‌పోర్టులోనే మోదీ విశ్రాంతి
అనవసర ఖర్చులు తగ్గించుకోడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పుడూ వెనుకాడరని అంటున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు విమానం ఎయిర్‌పోర్టులో ఆగాల్సి వస్తే.. ప్రధాని కూడా విమానాశ్రయ టర్మినల్స్‌లోనే విశ్రాంతి తీసుకుంటారని, అంతేగానీ లగ్జరీ హోటళ్లలో ఉండరని అన్నారు. లోక్‌సభలో ఎస్పీజీ(సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
6. ప్రజ్ఞా ఠాకూర్‌పై భాజపా వేటుజాతిపిత మహాత్మగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై భాజపా వేటు వేసింది. ప్రజ్ఞా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఆమెను రక్షణశాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేగాక.. ఈ విడత భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి కూడా ప్రజ్ఞాను దూరంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు.
7. ఎంత ఆరోగ్యంగా ఉన్నానో చూడండి: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోరుమీదుంటే అడ్డుకోవడం కష్టం. ఈ క్రమంలో అమెరికా ప్రజలకు అద్భుతమైన వినోదాన్ని పంచుతారు. ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకొంది. తాను అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు వచ్చిన ప్రచారంపై ట్రంప్ తన ట్విటర్ ఆయుధాన్ని ఎక్కుపెట్టారు. రాకీ-3ని తలపించేలా ట్రంప్-3 అవతారమెత్తారు. ఇది అమెరికా ప్రజలకు వినోదాన్ని, ట్రోలర్లకు చేతినిండా పనిని కల్పించింది.
8. అందుకే ఆసీస్ నన్ను స్లెడ్జింగ్ చేయలేదు: కుంబ్లే
మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎంతగా కవ్వింపులు చేస్తారో క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. కానీ, ఆసీస్ క్రికెటర్లు తనని స్లెడ్జింగ్ చేసేవారు కాదని టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నాడు. ‘‘నాకు ఆ విషయం పెద్దగా గుర్తులేదు. ‘మీరు షేన్ వార్న్ స్నేహితుడైతే స్లెడ్జింగ్‌కు గురికారు’ అని విన్నాను. నేను వార్న్ మిత్రుడిని కాబట్టి నన్ను ఎవరూ కవ్వించలేదు. బౌలర్ అందరికీ బౌలింగ్ చేయాలనుకుంటాడు’ అని అన్నాడు. ూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. లోయలో పడిన బస్సు.. 17 మంది మృతి
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి 17 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అర్ఘాకాచి జిల్లాలోని సింధికార్క నుంచి రూపందేహి జిల్లా బయల్దేరిన ఓ బస్సు మార్గమధ్యంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు.
10. ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రాజ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన’ అధినేత, బాల్ ఠాక్రే అన్నయ్య కుమారుడు రాజ్ ఠాక్రే హాజరుకానున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే తమ్ముడు వరుస అవుతారు.బాల్ ఠాక్రే మరణానంతరం శివసేనలో ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి ఉద్ధవ్ సఫలం కావడంతో అప్పటివరకూ పార్టీలో కీలకంగా ఉన్న రాజ్ ఠాక్రేకు ప్రాధాన్యం తగ్గింది. అనంతర పరిణామాల నేపథ్యంలో రాజ్ ఠాక్రే శివసేన నుంచి తప్పుకున్నారు. 2006లో ‘మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన’ పేరుతో పార్టీని స్థాపించారు.
నేటి పది ప్రధాన వార్తలు-11/28
Related tags :