మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తోలోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఆయన పర్యటన ఖరారు అయిన రోజు నుండి రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమాయంలో అక్కడి రైతులు సైతం రెండుగా చీలారు. కొందరు దళిత రైతులు చంద్రబాబు గ్రాపిక్స్ తో తమను మోసం చేసారని రాజధానిలో పర్యటించాలంటే ముందుగా క్షమాపణ చెప్పి రావాలని డిమాండ్ చేసారు. ఇక చంద్రబాబు రాజధానిలో పర్యటన ప్రారంభమైంది. ఇదే సమయంలో అనుకూల వర్గం నేతలు స్వగతం పలుకుతూ ..వ్యతిరేకుల నిరసనలు వ్యక్తం చేసారు. పోలీసులు రంగప్రవేశం చేయరు. మాజీ ముఖ్యమంరి చందబాబు అమరావతి పర్యటన పైన నలుగు రోజులుగా రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. రాజధాని రైతులు రెండు వర్గాలుగా చీలి పోయి చంద్రబాబు కు వ్యతిరేకంగా కొత్త డిమాండ్లను తేరా మీదకు తెచ్చారు. దళితుల భూముల విషయంలో మోసం చేసారని గ్రాఫిక్స్ తో మాయ చేసారంటూ కొందరు రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. అయితే చంద్రబాబు కొద్దిసేపటి క్రితం రాజధానిలో పర్యటన ప్రారంభించారు. చందబాబును రాకను స్వాగతిస్తూ కొందరు వ్యతిరేకిస్తూ మరికొందరు రెండు వర్గాలుగా చేలిపోయారు. వెంకటాయ పాలెం వద్ద చంద్రబాబుతో పాటుగా ఉన్న తెదేపా నేతల కాన్వాయ్ మీదకు చెప్పులు.. రాళ్ళు విసిరే ప్రయత్నం చేసారు. పోలీసుల రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. చంద్రబాబు వ్యతిరేకంగా వర్గం ఆయాన కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసారు. దళిత రైతులకు క్షమాపణ చెప్పకుండా ముందుకు వెళ్ళనీయమంటూ అడ్డుకునేందుకు దూసుకొచ్చారు. అదే సమాయంలో స్థానికంగా ఉన్న తెదేపా కార్యకర్తలు వారితో బాహాబాహికి దిగారు. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. యాక్సెస్ రోడ్డు వడ నిరసనలు కొనగాగుతున్నాయి. ప్రధాని మోడీ రాజధాని శంఖుస్థాపన చేసిన ప్రాంతం నుండి పర్యటన ప్రారంభించాలని తొలుత భావించారు. ముందుగా ప్రభుత్వం కూల్చివేసిన ప్రజవేదికను పరిశీలించారు. అయితే చంద్రబాబు కాన్వాయ్ ఓ ఉన్న బస్సును అడ్డుకునేందుకు ప్రయత్నం జరిగింది. రెండు వర్గాల రైతులు చంద్రబాబు పర్యటనకు అడ్డు చెప్పకుండా నిరసన కారులను పోలీసులు అడ్డుకుంటున్నారు చంద్రబాబు కాన్వాయ్ మీదకు రాళ్ళు విసిరెందుకు ప్రయత్నం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు

Related tags :