-పిలుపునిచ్చిన టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
-ఆస్ట్రేలియా లో ముఖ్య అతిథిగా హాజరు
ఆస్ట్రేలియాలో టిఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి,ఉపాధ్యక్షుడు రాజేష్ రాపోలు,ప్రవీణ్ అద్వర్యంలో దీక్ష దివాస్ ని ఘనంగా నిర్వహించారు.సిడ్నీ లో నిర్వహించిన ఈ వేడుకకు తెలంగాణవాసులు పాల్గొని విజయవంతం చేసారు.ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ దీక్ష దివాస్ లో మహేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎదో ఒక దేశంలో దీక్ష దివస్ లో పాల్గొంటున్నానని తెలిపారు.2009లో కెసిఆర్ ఆమరణ దీక్ష వలననే ప్రత్యేక తెలంగాణ సాదించుకున్నాం అన్నారు.గత పది సంవత్సరాలుగా విదేశాలలో జరుపుకుంటున్నామన్నారు.కెసిఆర్ పార్టీ పెట్టి తెలంగాణ సాధించేవరకు నిరంతరంగా పోరాటం చేసి చివరకు ఆమరణ దీక్షకు దిగి ఫలితాన్ని ముద్దాడారు.తన కృషి ఫలితమే తెలంగాణ వాసులు సుఖ సంతోషాలతో ,అనేక సంక్షేమా పథకాలను అనుభవిస్తున్నారు. దేశ విదేశాలలో ఈ పండుగను ఘనంగా నిర్వహించాలని 40 దేశాలలో ఉన్న టిఆర్ఎస్ ఎన్నారై విభాగాలకు పిలుపునిచ్చారు.