DailyDose

ఏపీ పోలీసులకు నివాళి అర్పించిన ఢిల్లీ ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు

AES ITO Students Take Part In Police Honor Parade In Delhi

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల అమరవీరులకు దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకస్థలి వద్ద ఏపీ పోలీసులు నిర్వహించిన గౌరవ వందనంలో ITO ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన విద్యార్థులు పాల్గొని ఘన నివాళి అర్పించారు. పోలీసులు, వారి బాధ్యతలు, సమాజం మెరుగుదలకు వారు చేసే కృషి చిన్నారులకు విద్యార్థి దశ నుండి అలవడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులను భాగస్వామ్యులు చేసినట్లు AES కార్యవర్గ సభ్యులు సుంకర ఈశ్వర ప్రసాద్ తెలిపారు.