ScienceAndTech

మీ గూగుల్ చరిత్ర చెరిపేసుకోండి

How to wipe your search and youtube history?

గూగుల్‌లో ఏది సెర్చ్ చేసినా అంతా స్టోర్ వుతుంది. మీ బ్రౌజర్ క్లీన్ చేసినప్పటికీ గూగుల్ ప్లాట్ ఫాంపై మీ ప్రైవసీ డేటా అలానే ఉంటుంది. అది డిలీట్ కాదు. అయితే మాన్యువల్‌గా డిలీట్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, అసిస్టెంట్ ప్లాట్ ఫాంల్లో స్టోర్ అయిన యూజర్ డేటాను ఎలా డిలీట్ చేయాలో ఓసారి చూద్దాం.

గూగుల్ మ్యాప్స్
గూగుల్ మ్యాప్స్‌లో మీరు ఏదైనా లొకేషన్ సెర్చ్ చేస్తున్నారా? గూగుల్ మ్యాప్స్ రీజియన్లవారీగా ఎప్పటికప్పడూ లొకేషన్లను ట్రాక్ చేస్తుంటుంది. మీ డేటాను గూగుల్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే మీరు క్రోమ్ బ్రౌజర్‌లో incognito mode టర్న్ ఆన్ చేసి సెర్చ్ చేయండి.
-క్రోమ్ incognito mode (Shift +Ctrl+N) ఓపెన్ చేయండి.
– ఇందులో సెర్చ్ చేస్తే.. గూగుల్ మీ డేటా యాక్టివిటీని ట్రాక్ చేయలేదు.
– మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? ఏ లొకేషన్‌లో ఉన్నారో ట్రాక్ చేయలేదు.

యూట్యూబ్ :
గూగుల్ సొంత సర్వీసుల్లో యూట్యూబ్ ఒకటి. మీరు సెర్చ్ చేసిన ప్రతి వీడియో అందులో స్టోర్ అవుతుంది. సెర్చ్ చేసిన డేటా డిలీట్ చేసుకోవాలంటే కొత్త టూల్ ద్వారా పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు.
-యూట్యూబ్ లాగిన్ అయ్యాక.. My activity ఓపెన్ చేయండి.
– Change how long you keep బటన్ పై క్లిక్ చేయండి.
-3 నెలలు తర్వాత హిస్టరీని ఆటోమాటిక్ డిలీట్ చేసుకోవచ్చు.
– 18 నెలల తర్వాత ఆటోమాటిక్ డిలీట్ సెట్ చేసుకోవచ్చు.
– Next బటన్ క్లిక్ చేయాలి.
-Delete Future, Delete Now అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
-కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయండి. Confirm బటన్ క్లిక్ చేయండి. ఇలా వీడియోల హిస్టరీని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు.

గూగుల్ అసిస్టెంట్ :
-వాయిస్ కమాండ్స్ ద్వారా ఈ అసిస్టెంట్ యాక్టివిటీని వెంటనే డిలీట్ చేసుకోవచ్చు.
-గూగుల్ అసిస్టెంట్ నుంచి ఏదైనా సెర్చ్ చేయాలంటే.. Hey Google అని వాయిస్ కమాండ్ ఇస్తుంటారు.
-Hey Google.. delete the last thing i said to you అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు.. అప్పటివరకూ సెర్చ్ చేసినా డేటా మాత్రమే డిలీట్ చేస్తుంది.