DailyDose

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు-వాణిజ్యం-11/29

Indian Stock Markets Down-Telugu Business News Roundup-11/29

* దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మరింత పతనమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ ఓ దశలో 400 పాయింట్లు కోల్పోయి భారీ నష్టాల్ని మూటగట్టుకుంది. మధ్యాహ్నం 12.43గంటల సమయంలో సెన్సెక్స్‌ 374పాయింట్లు కోల్పోయి 40,754 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 12,047 వద్ద ట్రేడవుతోంది.
* ప్రమోటర్‌‌ సుభాష్‌‌ చంద్ర రాజీనామా అనంతరం వార్తల్లోకి వచ్చిన జీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ లిమిటెడ్‌‌కు (జీల్‌‌) కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* హైదరాబాద్లో ఇంటెల్ కార్పొరేషన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనుంది. కృత్రిమ మేధ, 5జీ, అటానమస్ సిస్టమ్స్, కొత్తతరం గ్రాఫిక్స్ మొదలైన ఆధునిక టెక్నాలజీపై ఈ కేంద్ర దృష్టి సారిస్తుంది. నాలుగైదు రోజుల్లో కంపెనీ దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సలార్పురియా నాలెడ్జ్ సిటీలోని 4 అంతస్తులను ఇంటెల్ లీజుకు తీసుకుంది. ఈ కేంద్రం 1,500 మంది ఇంజినీర్లు పనిచేయడానికి సదుపాయాలు ఉంటాయి.
* మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గతవారం ఇచ్చిన ఆదేశాలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎ్సబీఎల్).. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించింది. సెబీ ఆదేశాల కారణంగా ప్రస్తుత క్లయింట్లు తమ షేర్ల విక్రయం, బదలాయింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శాట్కు కార్వీ వివరించింది.
*ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలైన బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో రిటైర్మెంట్ వయసును 58 ఏళ్లకు తగ్గించే యోచన ఏదీ లేదని రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాచారంలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే తెలిపారు.
*ఛిన్న, మధ్య స్థాయి కంపెనీలు రోజువారీ వాయిదాల్లో (ఈడీఐ) రుణాలు తిరిగి చెల్లించే విధంగా ముత్తూట్ ఫిన్కార్ప్ ఎంఎ్సఎంఈ రుణాలు ఇస్తోంది. ఇది ఖాతాదారులకు చాలా వెసులుబాటుగా ఉంటోందని, చిన్న,మధ్య స్థాయి సంస్థ లు తీసుకునే రుణం రూ.15,000 నుంచి రూ.3 లక్షల వరకూ ఉంటుందని ముత్తూట్ ఫిన్కార్ప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) వాసుదేవన్రామస్వామితెలిపారు