DailyDose

పార్లమెంటులో హెల్మెట్ పెట్టుకున్న ఎంపీలు-రాజకీయ-11/29

Japanese Members Of Parliament Wore Helmets To Sessions-Telugu Political Roundup-11/29

*జపాన్ పార్లమెంటులో ఉన్నట్లుంది ఏమ్పీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు. స్పీకర్ తో సాహా అంతా తెల్లరంగు హెల్మెట్లు ధరించారు. ఇదేదో నిరసన వ్యక్తనం చేయడానికి కాదండోయ్.. భూకంపాల నుంచి తమని తాము రక్షించుకోవడం కొసం జపాన్లో తరచుగా భూకంపాలు ఏర్పడతాయనే సంగతి మనకు తెలిసిందే. ఈనేపద్యంలో ఎంపీలు తమ ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన నియమాలపై ఇటీవల ఎర్త్ కేక్ డ్రిల్ నిర్వహించారు.
* చంద్రబాబు సమాధానం చెప్పాలి : పురందేశ్వరి
రాజధాని అమరావతి నిర్మాణంలో పూర్తిగా విఫలమై, నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నాయుడు నిలువునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి శుక్రవారం ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధాని ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్‌తో ఎందుకు మోసం చేశారని చంద్రబాబును ఆమె సూటిగా ప్రశ్నించారు. రైతులడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 2500 కోట్లు ఇస్తే సరైన లెక్కలు చూపలేదని విమర్శించారు. రాజధానిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, వారిది కేవలం ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.
*వైకాపాలో చేరిన కారెం శివాజీ
ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ కారెం శివాజీ వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. శివాజీకి జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు కారెం శివాజీ తెదేపాలో కొనసాగారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు
*మహారాష్ట్ర సిఎం తీసుకున్న తోలి నిర్ణయం
నిన్న మహారాష్ట్ర పద్దెనిమిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్దావ్ థాకరే ఛత్రపతి శివాజీ స్వయంగా నిర్మించిన రాయగడ కోట అభివృద్దికి నిధులను విడుదల చేస్తూ తోలి నిర్ణయం తీసుకున్నారు ఈ పురాతన కోటను అభివృద్ధి చేసేందుకు రూ. ఇరవై కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. సి ఎం గా పదవి బడయ్తలు స్వీకరించిన అనంతరం వెంటనే తోలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ఉద్దావ్ రాయగడ కోటపై మరింత దృష్టిని సారిస్తామని టూరిజంకు పెద్దపీట వేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం మహారాష్ట్రలోని పేదల వికాసానికి కృషి చేస్త్సామని తెలిపారు. ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి రైతుల పంట దెబ్బతిని విహయాన్ని గుర్తు చేసినా ఆయన రైతులకు ఆదుకుంటామని చెప్పారు.
* బొత్సకు శ్మశాన వైరాగ్యం వచ్చింది: కాల్వ శ్రీనివాసులు
చంద్రబాబు బస్సుపై రైతులు, రియల్టర్లు దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. నిన్నటి ఘటన వైసీపీ గూండాల పనేనన్నారు. బొత్స సత్యనారాయణకు ఆరు నెలల్లోనే శ్మశాన వైరాగ్యం వచ్చిందని కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. పేరుకు పదవులు ఇచ్చి బీసీ మంత్రులను కీలుబొమ్మలుగా మార్చారన్నారు. డీజీపీ తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకోవాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
* చంద్రబాబు బస్సుపై పోలీస్ లాఠీ విసిరారు: అచ్చెన్నాయుడు
పోలీసుల తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిలో పర్యటిస్తుండగా చంద్రబాబు బస్సుపై పోలీస్‌ లాఠీ విసిరారు.. ఎవరు వేశారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై దాడి ఘటనను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని చెప్పారు. చంద్రబాబుపై దాడికి సీఎం జగన్‌, డీజీపీ సవాంగ్‌ బాధ్యత వహించాలన్నారు. డీజీపీ ప్రకటన ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘రాజధాని ప్రాంత ప్రజలకు ఆగ్రహం ఉంటే అన్ని‌చోట్లా దాడి జరగాలి కదా?, జగన్ పర్యటనలో కూడా మేము నిరసనలు తెలుపుతాం, వీటికి డీజీపీ అనుమతి ఇవ్వకపోతే.. మిమ్మలను వైసీపీ కార్యకర్తగా పరిగణిస్తాం, మంత్రి బొత్స పక్కన అనువాదకుడిని పెట్టుకుని మాట్లాడాలి.. టీడీపీ ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తే.. మీరు మాపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ఆయన ప్రశ్నించారు.
* ఫడణవీస్‌కు కోర్టు సమన్లు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు నాగ్‌పూర్‌ పోలీసులు సమన్లు అందజేశారు. స్థానిక కోర్టు జారీ చేసిన ఈ సమన్లను గురువారం అందించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఉన్న రెండు క్రిమినల్‌ కేసులను పేర్కొనలేదని తెలుపుతూ ఈ సమన్లు జారీ అయ్యాయి. వీటిని నాగపూర్‌లోని ఫడణవీస్‌ నివాసంలో అందజేసినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.శివసేన సారథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజే ఫడణవీస్‌కు సమన్లు అందించడం గమనార్హం. ఫడణవీస్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ నాగపూర్‌ న్యాయవాది సతీశ్‌ యూకే వేసిన పిటిషన్‌ను స్థానిక మెజిస్ర్టేట్‌ కోర్టు నవంబర్‌ 1న పునరుద్ధరించింది. అయితే గతంలో న్యాయవాది వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ముంబై హైకోర్టు సమర్థించింది. అయితే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అక్టోబర్‌ 1న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
* మంత్రుల భాషపై సీఎం సమాధానం చెప్పాలి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బూతుల సంస్కృతిని ప్రోత్సహించేందుకే సీఎం తెలుగు భాష వద్దంటున్నారా? అని నిలదీశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని బూతుల మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల భాష మీద ప్రజలు వివరణ కోరుతున్నారని అన్నారు.వారికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార అహంకారంతో జగన్ ఇలా మంత్రులతో మాట్లాడిస్తున్నారా? లేక అభివృద్ధి చేయలేకపోతున్నామనే అసహనంతో ఇలాంటి భాష వస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టి ముగింపు దశకు తీసుకొచ్చామని చెప్పారు. వాటిని అందుబాటులోకి తీసుకురావటానికి వైకాపా సర్కార్‌కు చేతులు రావట్లేదని దేవినేని ఉమా మండిపడ్డారు.
*చేసుకున్న వాడికి చేసుకున్నంత: కన్నా
అమరావతిలో చంద్రబాబు పర్యటన జరిగిన తీరు.. చేసుకున్న వాడికి చేసున్నంత మహదేవ అన్న చందంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘‘రాష్ట్రాభివృద్ధికి, రాజధానికి నిధులు ఇచ్చిన మోదీ నాడు రాష్ట్రానికి వచ్చినప్పుడు నల్ల బెలూన్లతో స్వాగతం పలికి దుష్టబుద్ధి చూపావు.. గ్రాఫిక్స్తో తయారు చేసిన అమరావతికి పెయిడ్ ఆర్టిస్టులతో వెళ్లిన నీకు, నేడు చెప్పులతో స్వాగతం లభించింది’’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
*గ్రాఫిక్స్’ అన్నవాళ్లు ఇప్పుడేమంటారు: లోకేశ్
‘‘గ్రాఫిక్స్ రాజధాని.. అమరావతి శ్మశానం.. అన్న వైకాపా నాయకులు రాజధాని భవనాలను చూశాక ఏం సమాధానం చెబుతారు’’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబు రాజధాని పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎన్జీవోల కోసం నిర్మించిన భారీ గృహ సముదాయాలను చూపిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇవన్నీ భవనాలు కావా..?గ్రాఫిక్సా..? అమరావతి శ్మశానమా..? 90 శాతం పూర్తి చేసిన భవనాలిస్తే.. అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా వైకాపా ప్రభుత్వం వాటిని పూర్తిచేయలేకపోయింది
*ప్రజ్ఞా ఠాకుర్పై భాజపా కొరడా
జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే గురించి భాజపా ఎంపీ ప్రజ్ఞా ఠాకుర్ చేసిన వ్యాఖ్యలు ఇంటాబయటా పెను దుమారాన్ని రేకెత్తించాయి. ఆమెపై అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. బుధవారం సభలో ఆమె చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి సభాపతి తొలగించగా వాటిపై గురువారం కూడా లోక్సభ స్తంభించిపోయింది. మరోపక్క భాజపా ఆమెపై క్రమశిక్షణ చర్యల కొరడా ఝళిపించింది. ఆమెను రక్షణ సంబంధిత పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ నుంచి తొలగించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్లమెంటరీ పార్టీ భేటీలకు హాజరు కాకుండా నిషేధం విధించింది.
*ఉప ఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. భాజపా రెండో స్థానంలో నిలిచింది. కాలియాగంజ్లో తృణమూల్ అభ్యర్థి తపన్ దేవ్ సిన్హా భాజపా అభ్యర్థిపై 2,414 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇది భాజపా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్గంజ్ లోక్సభ స్థానం పరిధిలో ఉంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో భాజపా ఈ సెగ్మెంట్లో 56వేల ఓట్ల మెజార్టీని సాధించింది. ఖరగ్పుర్ సదర్ స్థానంలో తృణమూల్కు చెందిన ప్రదీప్ సర్కార్.. భాజపా అభ్యర్థిపై 20,853 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీకి ఈ సెగ్మెంట్లో దాదాపు 45 వేల మెజార్టీ రావడం గమనార్హం.
*అమరావతిపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: బొత్స
విభజన అనంతరం అప్పుడే పుట్టిన బిడ్డగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలు చంద్రబాబుకు అవకాశం ఇస్తే.. ఆయన ఎందుకు పనికిరాకుండా మార్చారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజనతో జరిగిన నష్టం కంటే చంద్రబాబు ఐదేళ్ల పాలనవల్ల రాష్ట్రం ఇంకా ఎక్కువగా నష్టపోయిందని వివరించారు. చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం వైకాపాకు లేదని స్పష్టం చేశారు. అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. రాజధాని అభివృద్ధి విషయంలో వైకాపా సర్కారుకు జాప్యం చేయాలనే ఉద్దేశం లేదని బొత్స అన్నారు.
*బెంగాల్లో భాజపాకు ఎన్ఆర్సీ దెబ్బ?
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తగిలిన దెబ్బ నుంచి కోలుకోక ముందే భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ఇదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాలకు 18 స్థానాల్లో గెలుచుకుని మమత ప్రభుత్వానికి చెమటలు పట్టించిన ఆ పార్టీ.. నెలలు తిరగకముందే మూడుస్థానాల్లోనూ ఓటమి పాలవ్వడం గమనార్హం. ఈ ఓటమి వెనుక జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) విషయంలో నెలకొన్న అపోహలు కారణమనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని అటు అధికార తృణమూల్తో పాటు ఇటు భాజపా రాష్ట్ర నేతలు సైతం అంగీకరించడం గమనార్హం.
*ఆఖరికి మంచి నిర్ణయం: నారాయణ
ఆర్టీసీ సమ్మె విషయంలో తెగేదాక లాగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖర్లో మంచి నిర్ణయం తీసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె ముగియడం హర్షణీయమని.. అయితే యూనియన్లు ఉండొద్దన్న సీఎం వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు.