*కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ అరెస్టు కోసం ఈడీ కాసుక్కోర్చుంది. ఆయన అరెస్తి పై స్తే ఎత్తివేయాగానే అదుపులోకి చిదంబరాన్ని అరెస్టు చేస్తామని ఈడీ తరపున కోర్టులో వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీమ్కోర్టుకు తెలిపారు.
*నాంపల్లి మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ కింద ఉన్న పాతభవనంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగకమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మెట్రో స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
* రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సుల కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వంవచ్చే జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు లైసెన్సులు జారీమున్సిపల్ కార్పోరేషన్ లు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలు యూనిట్ గా బార్లు కేటాయింపుకార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు 4లక్షల 50 వేలు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలలో ఫీజు 2 లక్షలుగా నిర్దారణవిజయవాడ,విశాఖలో దరఖాస్తు ఫీజు 7 లక్షలుగా నిర్దారణ98ఏడాదికి లైసెన్సు ఫీజు 5 లక్షలుగా నిర్దారించిన ప్రభుత్వంఇవాల్టినుంచి వచ్చే నెల 6 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణడిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్న కలెక్టర్లుఅదేరోజు రాత్రి 7 గంటల కల్లా బార్ల కేటాయింపు జాబితా విడుదల.
*ఒంటిపై కిరోసిన్ పోసుకుని తండ్రీకుమార్తె ఆత్మహత్యకు యత్నించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. భూతగాదా విషయంలో అధికారులు తమకు న్యాయం చేయడం లేదంటూ అప్పారావు, కుమార్తె ప్రభావతి శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. వెంటనే గమనించిన స్థానికులు, రెవెన్యూ సిబ్బంది తండ్రీకుమార్తెలను అడ్డుకుని వారిపై నీళ్లు చల్లారు. దీంతో ప్రమాదం తప్పింది
* అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌లో ఘోరం జరిగింది. దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిని గొల్ల బసవరాజు (55), రామలక్ష్మమ్మ (45)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* హైదరాబాద్‌లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఇద్దరు నారాయణ కళాశాల విద్యార్థులు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి మాదాపూర్ నారాయణ కళాశాల నుంచి 9 విద్యార్థులు అదృశ్యమయ్యారు.
* తల్లి మాట వినకపోగ ఆమెను దారుణంగా హత్యచేసిన కీర్తి ఇప్పుడు పశ్చాత్తాపంతో కన్నీరుమున్నీరవుతోంది. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న కీర్తిని ఆమె తండ్రి, అమ్మమ్మ, చిన్నమ్మ కలిశారు.
* తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన డాక్టర్ ప్రియాంక హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రియాంకారెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాసేపట్లో నిందితులను మీడియా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ప్రియాంక స్కూటీని ముందే పంక్చర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
* తమిళనాడులోని కంచిలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. శబరిమల నుండి కంచి వస్తుండగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని పాచిపెంట మండల పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వర రావు(25)గా గుర్తించారు. మిగిలిన వారు కూడా అదే గ్రామానికి చెందినవారిగా భావిస్తున్నారు.
*ప్రమాదవశాత్తు బండరాళ్లు మీద పడి వరంగల్ రూరల్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామ శివారులో గురువారం ఈ ప్రమాదం జరిగింది.
*ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి గౌతమ్రెడ్డి పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో వంశీకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి మీడియాకు వెల్లడించారు.
*వరంగల్లో యువతి హత్యాచారం కేసును పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. ఆమెతో పరిచయం ఉన్న వ్యక్తే ఈఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వరంగల్ సీపీ రవీందర్ వెల్లడించారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు.
*ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ సమీపంలో ప్రభుత్వ స్థలాలను, అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులకు తిరిగి కొలువులు ఇప్పిస్తానంటూ రూ. లక్షలు దండుకున్న ఘరానా మోసగాడిని బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు
*మధ్యప్రదేశ్కు చెందిన కరడుగట్టిన కంజారా ముఠాను కర్నూలు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆపరేషన్లో ఇద్దరు డీఎస్పీలతో సహా సీఐ, ఎస్సైలు, వంద మంది పోలీసులు పాల్గొన్నారు.
*బీమా వైద్య సేవల (ఐఎంఎస్) విభాగం కుంభకోణంలో నిందితులకు ఊరట లభించింది. అవినీతి నిరోధక శాఖ తొలి విడత అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది
*చేసిన అప్పులు తీర్చలేక పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధి జయరాంతండాలో గురువారం వెలుగు చూసింది.
*ముంబయి పోలీసులకు మోస్ట్వాంటెడ్గా ఉన్న ఘరానా నేరస్థుడు, అపా ఇన్ఫ్రా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, చింతామణి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సంచాలకుడు బాలాసాహెబ్ అబాసాహెబ్ కడం ఎట్టకేలకు గురువారం హైదరాబాద్లో చిక్కాడు. తమకు అందిన సమాచారం మేరకు గురువారం హైదరాబాద్కు వచ్చిన ముంబయి పోలీసులు మాదాపూర్ ప్రాంతంలో అతడిని పట్టుకున్నారు.
* మాదాపూర్‌లోని నారాయణ కాలేజీకి చెందిన 9 మంది విద్యార్థులు స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం కాలేజీ గోడదూకి కారులో రాజేంద్రనగర్ వెళ్లారు. విద్యార్థులంతా బర్త్‌డేకి టిఎస్ 07 ఈబి 3680 సఫారీ స్ట్రోమ్ కారులో వెళ్లారు. బర్త్‌డే వేడుకలు ముగిసిన తర్వాత వారంతా తిరిగి అదే కారులో కాలేజీకి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ఆరంఘర్ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉదయ్, తరుణ్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
*మహాత్మగంధిని హత్య చేసిన నాదూరం గాడ్సేను దేశ భక్తుడిగా కీర్తించిన భాజపా ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్ టాకూర్ పై విపక్షాలు మండిపడుతున్నాయి.
* కర్నూలు జిల్లా పాములపాడు మండలం బాణకచెర్ల వద్ద తేనెటీగల దాడిలో మంత్రి అనిల్ కుమార్ తోపాటు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు గాయాలు…
చిదంబరం కొడుకు అరెస్టుకు రంగం సిద్దం-నేరవార్తలు-11/29
Related tags :