* ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి విజయవాడలోని వివేకానంద కాలనీలో అద్దెకు తీసుకున్న ఇంటికి రూ.లక్ష చొప్పున నెల అద్దె, రూ.5 వేలు క్యాంపు కార్యాలయ అలవెన్స్ కింద మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది.
*చైనా శాస్త్రవేత్తలు భారీ బ్లాక్ కనుగొన్నారు సూర్యుడి ద్రవ్యరాసీ కంటే ఈ బ్లాక్ హోల్ ద్రవ్యరాసీ 70 రెట్లుగా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
*ఈ సారి శీతాకాలం కాస్త వెచ్చగానే ఉండనున్నది. సాధారణంగా శీతాకాలం చలి చంపేస్తుంది. కానీ దేశవ్యాప్తంగా ఈ శీతాకాలం పెద్దగా చలి ఉండదని భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇండియాలో శీతాకాలం ఉంటుంది. అయితే ఈసారి శీతాకాలంలో సాధారణం కన్నా.. స్వల్ప ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండనున్నట్లు ఐఎండీ పేర్కొన్నది. కేవలం ఉత్తర భారత దేశంలో మాత్రం ఎప్పటిలాగే కొంత చలిగానే ఉండనున్నది.
*రెండవ త్రైమాసికంలో జీడీపీ తగ్గింది. జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు ఉన్నది. సుమారు 8 కోట్ల పరిశ్రమలు అక్టోబర్‌లో తమ ఉత్పత్తులను 5.8 శాతం తగ్గించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
*రాష్ట్ర ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు వెల్లడించింది. మార్చి 4 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ. అదేవిధంగా మార్చి 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల నిర్వహణ. కాగా ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష.. జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష జరగనుంది.
* ఏపీ పోలీసుశాఖకు చెందిన ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా టీవీ నాగరాజు, ఏసీబీ ఎస్పీగా జె.భాస్కర్‌రావు, విజయవాడ ఇంటలిజెన్స్ ఎస్పీగా కె. బాల వెంకటేశ్వరరావులను నియమించింది. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె. సూర్యచంద్రరావును పదోన్నతిపై విజయవాడ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* శ్రీలంక అభివృద్ధికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు.
* రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సుల కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వంవచ్చే జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు లైసెన్సులు జారీమున్సిపల్ కార్పోరేషన్ లు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలు యూనిట్ గా బార్లు కేటాయింపు
కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు 4లక్షల 50 వేలు,మున్సిపాలిటీలు,నగర పంచాయతీలలో ఫీజు 2 లక్షలుగా నిర్దారణ
* తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహిళలు రాత్రి సమయాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏదైనా డేంజర్ ఉందని అనుమానం వచ్చినా, అలాంటి సంఘటనలు కనిపించినా, వాహనాలు పంక్చర్ లేదా ఇతర సాంకేతిక సమస్యలతో నిలిచిపోయినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని కోరారు. ఎలాంటి సంకోచం లేకుండా 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. తాము ఒక్క క్లిక్ దూరంలో ఉంటామని భరోసా ఇచ్చారు.
* విదేశీ మహిళకు కుచ్చు టోపీ పెట్టిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగింది. సత్యసాయి భక్తుడు రాజేష్ సక్సేనా విదేశీ మహిళ నుంచి రూ. లక్షలు స్వాహా చేశాడు. మోసపోయినట్లు గ్రహించిన ప్రాన్స్ దేశస్తురాలు కేథరిన్.. కన్నీటి పర్యంతమవుతూ.. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ సత్య ఏసు బాబుకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
* హైదరాబాద్ మెట్రోరైలులో మరో మార్గం అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రోలైన్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ జెండా ఊపి కొత్త లైనును ప్రారంభించారు. 1.5కి.మీ పొడవున్న ఈ మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాధారణ ప్రయాణికులను అనుమతించనున్నారు.
* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మేరకు ఆర్టీసి కార్మికులు ఉద్యోగాల్లో చేరడంతో తాము రోడ్డున పడ్డామని, ప్రస్తుతం తమ పరిస్థితి ఏంటని జీడిమెట్ల డిపో తాత్కాలిక ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించిన రోజు నుండి ముగిసేవరకు తాము విధులు నిర్వహించామని, ఇప్పుడు వారు విధులలో చేరుతుంటే.. తమను అడిగే నాథుడే లేడని తాత్కాలిక బస్ డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు.
* ఆకాశాన్ని అంటిన ఉల్లిపై…దొంగలు సైతం దృష్టి సారించారు. బంగారం, వజ్రాలు, నగదే కాదు ఉల్లిగడ్డలు కూడా చోరీకి అర్హమే అంటూ కొందరు దొంగలు ఏకంగా లారీ ఉల్లిగడ్డలను చోరీ చేసిన బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
*సమాజంలో జరుగుతున్న తప్పులకు వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడే జ్యోతిరావు ఫులేలా గొప్పవాళ్లమవుతామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు.
*వేతన సవరణ సంఘం (పే రివిజన్ కమిషన్- పీఆర్సీ) గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం.3006) జారీ చేసింది.
*మున్సిపల్ ఎన్నికలపై వివాదాలకు దాదాపుగా తెరపడనుంది. వార్డుల విభజనకు జులై 7న జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవడానికి సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు అంగీకరించిన పిటిషనర్ల పిటిషన్లపై శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది.
*రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ఆదుకుందామని, కార్మికులపై మానవతా దృక్పథం చూపాలని భావించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిమండలి సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది.
*ఆంధ్రుల ఆశల రాజధాని అమరావతిని చంపేసి… భావితరాల భవిష్యత్తు పాడు చేయొద్దని తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి జోలికొచ్చి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని హెచ్చరించారు.
*వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.571 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక విధానం తేవాలని తీర్మానించింది. రాష్ట్రంలోని 28 కార్పొరేషన్లకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమించేందుకు వీలుగా వాటిని లాభదాయకమైన పదవుల జాబితా నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదముద్ర వేసింది.
*మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రజల సహాయసహకారాలు అవసరమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఏర్పాటయిన కార్యక్రమంలో సీఐడీ నార్కోటిక్ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ ‘7382296118’ నెంబర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మాదక ద్రవ్యాలు, గంజాయి ఉత్పత్తి, రవాణా తదితర అంశాలపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తాం’ అని తెలిపారు.
*ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి విజయవాడలోని వివేకానంద కాలనీలో అద్దెకు తీసుకున్న ఇంటికి రూ.లక్ష చొప్పున నెల అద్దె, రూ.5 వేలు క్యాంపు కార్యాలయ అలవెన్స్ కింద మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది.
*రాష్ట్రంలోని 4 జిల్లాల పరిధిలో సౌకర్యమైన ఇళ్ల విభాగంలో 14,368 ఇళ్లకు చేపట్టిన రివర్స్ టెండరింగ్లో ప్రభుత్వానికి 105.91 కోట్లు ఆదా అయ్యాయి. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో గురువారం రివర్స్ టెండరింగ్ నిర్వహించారు.
*రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం ఆయన లేఖ రాశారు.
*దివ్యాంగుల గుర్తింపు ధ్రువీకరణపత్రాల జారీ విధానాన్ని విస్తరిస్తున్నారు. జిల్లా, బోధనాసుపత్రులు, ప్రాంతీయ ఆసుపత్రుల్లోనే కాకుండా వచ్చేనెల 15 నుంచి 175 నియోజకవర్గ కేంద్రాల్లో వారానికో రోజు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దివ్యాంగులకు ధ్రువీకరణపత్రాలు జారీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది.
*పెళ్లి కానుక అమలులో ఇప్పటివరకు క్రియాశీలంగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల (డీఈవో) సేవలను డిసెంబరు 1 నుంచి నిలిపేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వీరికి రావలసిన 8 నెలల గౌరవవేతనంలో 6 నెలలకు సంబంధించి నిధులు విడుదల చేసి ఇక నుంచి సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
*జగన్ అక్రమాస్తులకు సంబంధించి పెన్నా ప్రతాప్రెడ్డి నేతృత్వంలోని పెన్నా సిమెంట్స్, ఎంబసీ రియల్టర్స్ ఆస్తుల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పెన్నా గ్రూపునకు చెందిన పయనీర్ హాలిడే రిసార్ట్స్ హోటల్ జప్తునకు సమానమైన మొత్తాన్ని డిపాజిట్ చేయాలని, అయితే ఆస్తిని అన్యాక్రాంతం చేయరాదని ఆదేశించిం
*మైసూరు నుంచి నెల్లూరుకు తరలించిన ప్రాచీన తెలుగు అధ్యయన పీఠం ప్రాంగణానికి ఐదు ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
*రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశాలపై త్వరలో నివేదిక సమర్పిస్తామని జీఎస్రావు కమిటీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తెలిపింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రిని నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎస్రావు, కార్యదర్శి విజయమోహన్, సభ్యులు డాక్టర్ అంజలీమోహన్, కేటీ రవీంద్రన్, డాక్టర్ మహావీర్, సుబ్బారావు కలిశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.
మంత్రి పుష్పశ్రీవాణి ఇంటి అద్దె రూ.లక్ష-తాజావార్తలు-11/29
Related tags :