NRI-NRT

గిలిగింతల నడుమ టాంటెక్స్ 148వ నెలనెలా తెలుగు వెన్నెల

గిలిగింతల నడుమ టాంటెక్స్ 149వ నెలనెలా తెలుగు వెన్నెల-Rambhatla Parvateesva Sharma Awarded With Avadhana Kishora By TANTEX

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో నవంబరు17 న అష్టావధానం కార్యక్రమాన్ని డాలస్ లో హిందూ దేవాలయం యూత్ సెంటర్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు సభను ప్రారంభించి, ” శతావధాని ” , “అవధాన భీమ”, “అవధాన సుధాకర”, “అవధాన భారతి” డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మకి స్వాగతం పలికి, టాంటెక్స్ కమిటి సభ్యులను సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా అవధాని పూడూర్ జగదీశ్వరన్ సంధాతగా వ్యవహరించారు. డా.ఊరిమిండి నరసింహరెడ్డి దత్తపది, డా. తోటకూర ప్రసాద్ ఆశువు, నందివాడ ఉదయ్ న్యస్థాక్షరి, మద్దుకూరి చంద్రహాస్ నిషిద్ధాక్షరి, వేముల లెనిన్ సమస్య, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వర్ణన, డా. జువ్వాడి రమణ చందోభాషణం అంశాలతో, రాయవరం భాస్కర్ తన అప్రస్తుత ప్రసంగంతో, కస్తూరి గౌతం, దొడ్ల రమణ లేఖకుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దత్తపది అంశంలో ఊరిమిండి నరసింహా రెడ్డిగారు హలము, కలము జలము, బలము కలియుగంలో మానవుని సంతృప్తి పరిచే మార్గమేమిటి?, “బలము వర్జించు దుర్జలములను హంస ..” అన్న పద్యంతో అవధాని పూరించారు. శ్రీ నందివాడ ఉదయ్ గారు నం. హ. రి. త అక్షరాలతో న్యస్తాక్షరి సమస్య ఇచ్చారు , తీరా చూస్తే తమ అమ్మాయి పేరు నం హరిత వచ్చేలా సాహిత్యానుభూతి పై వర్ణించమన్నారు ,క్లిష్టమైన నిషిద్ధాక్షరి ప్రక్రియ తో మద్దుకూరి చంద్రహాస్ అవధానిని , ఆయా అక్షరాలను నిషేధించడం ద్వారా ఆయన దారి మళ్లించే ప్రయత్నమే క్లుప్తంగా నిషిద్ధాక్షరి అంటే. ఆయన దారులు ఆయనకు ఉంటాయి కదా అనిపించేలా ‘ప్రాపుగ పరీక్షలందున యేపుగ తెలుగన్న పోటి యెపుడున్ గాచున్ ‘ చక్కగా పూరించారు. వేముల లెనిన్ ” తమనీడను ప్రాణులెల్ల త్రాగుచునుండెన్ ” అని చిత్రమైన సమస్యను, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “నలుడు జూదమాడెడి సందర్భంలో దమయంతి సమయస్ఫూర్తి ” వర్ణనను, డా. తోటకూర ప్రసాద్ ” ఆంధ్రాలో ఆంగ్లము పై అభిప్రాయము ” మీద ఆశువు , డా. జువ్వాడి రమణ ఛందోభాషణ “ఆరేసుకోబోయి పారేసుకున్నాను, కోకెత్తుకెళ్ళింది కొండగాలి” చెప్పిన సీస పద్యం చక్కగా గానం చేస్తే అవధాని గారు “పాటల పేటల కోటలుగట్టిన, వోపృచ్ఛకాగ్రణి వొదిగె పాట” క్షణం ఆలస్యం చెయ్యకుండా చెప్పారు. వాతావరణంలో సాహిత్య సాంద్రత ఎక్కువ అవుతున్నపుడల్లా తన ఛలోక్తులతో , అప్రస్తుత ప్రసంగంతో రాయవరం భాస్కర్ నవ్వులు పూయించారు. డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మని టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మరియు టాంటెక్స్ కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక మరియు “అవధాన కిశోర” బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
గిలిగింతల నడుమ టాంటెక్స్ 149వ నెలనెలా తెలుగు వెన్నెల-Rambhatla Parvateesva Sharma Awarded With Avadhana Kishora By TANTEX