Editorials

26ఏళ్లు అవుతుందంటే నమ్మలేకపోతున్నాను

Ratan TATA Remembers JRD Tata

టాటా సంస్థల వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా వర్థంతి సందర్భంగా సంస్థ ప్రస్తుత గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా భావోద్వేగపు పోస్ట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘జేఆర్‌డీ టాటా కన్నుమూసి 26 ఏళ్లు అవుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన నాకు ప్రియ స్నేహితుడేకాక, రోల్‌ మోడల్‌, గురువు. ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది. మేమిద్దరం కలిసి ఎంతో సమయం పాటు టెల్కోలో (టాటా ఇంజినీరింగ్‌ అండ్‌ లోకోమోటివ్‌ కంపెనీ ప్రస్తుత టాటా మోటర్స్‌) పని చేసేవాళ్లం. పనివాళ్లు, సూపర్‌వైజర్లపై ఆయన చూపించే అభిమానం, స్వచ్ఛమైన ప్రేమను మర్చిపోలేను.’’ అని పోస్ట్‌లో వివరించారు. రతన్‌ టాటా చేసిన ఈ పోస్ట్‌ను కొంత సేపట్లోనే 1.7 లక్షల మంది లైక్‌ చేయగా, వేలాది కామెంట్లు రాశారు. జెహంగీర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ టాటా 89 ఏళ్ల వయసులో 1993 నవంబరు 29న కన్నుమూశారు.