లండన్ లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే ఆద్వర్యం లో “కేసీఆర్ దీక్షా దివస్” ని ఘనంగా నిర్వహించారు.
నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా బావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటూ, లండన్ లో పార్లమెంట్ స్క్వేర్ దగ్గర గాంధీ విగ్రహం వద్ద దీక్ష దివస్ ని నిర్వహించారు.
ముందుగా గాంధీ విగ్రహానికి పూలతో నివాళులర్పించి అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అధ్యక్షుడు అశోక్ గౌడ్ దుసరి మాట్లాడుతూ, సరిగ్గా పది సంవత్సరాల క్రితం ” తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో ” అనే నినాదం తో తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టం. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమం లో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనలును ఏకం చేసి, శాంతి యుత పోరాటాం తో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు.
నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీ జీ గారు ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీ జీ – కేసీఆర్ గారు పాటించి రాష్ట్ర సాధానోద్యమంలో ఎటువంటి హింస కు తావు లేకుండా, శాంతియుత పంధా తో ఏదైన సాధించవచ్చు అనే గొప్ప సందేశాన్ని, అటు భారత దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని – మార్గాన్ని చూపిన గొప్ప స్పూర్తి దాత నాయకుడు మన కేసీఆర్ గారని ప్రశంసించారు.
ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టమని. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారని. ఈ సంధర్భంగా ప్రతిపక్షాలు చాతనాయతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, లేకుంటే రాజకీయ విమర్శలకు ఎప్పటికప్పుడు జవాబు చెప్తామని, సరియైన సందర్భం లో ప్రజలు తగిన గుణ పాఠం చెప్తారని తెలిపారు.
చివరిగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ…. లండన్ నుండి కెసిఆర్ గారు తలపెట్టిన దీక్ష నుండి నేటి వరకు వారికి మద్దతుగా ఉంటూ, చేపట్టిన కార్యక్రమాలని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో అద్యక్షులు అశోక్ గౌడ్ దుసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శులు సృజన్ రెడ్డి చాడా, సత్యమూర్తి చిలుముల, శ్రీకాంత్ జిల్లా, సంయుక్త కార్యదర్శులు రమేష్ ఇస్సంపల్లి, సురేష్ గోపతి హాజరైన వారిలో ఉన్నారు