Movies

రాజశేఖర్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు

Traffic Cops Recommend Hero Rajasekhar License Cancellation

తరచూ ఏదో ఒక ప్రమాదానికి కారణమవుతున్న హీరో రాజశేఖర్ లైసెన్సును రద్దు చేయాల్సిందిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. ఇటీవల సినీ హీరో రాజశేఖర్, తన వాహనాన్ని స్వయంగా నడుపుతూ, రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. దీంతో ఈ తరహా సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీయేకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ లేఖను పంపారు. రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆ లేఖలో కోరారు. ఆయన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని, ఓఆర్ఆర్‌పై ఇంత నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుందని వారు గుర్తు చేశారు. కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సిఫార్సులపై ఆర్టీయే అధికారులు నిర్ణయం తీసుకోవాల్సివుంది. కనీసం ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.