Politics

చంద్రబాబుపై వైకాపా మరొక దాడికి సన్నద్ధం

YSRCP vs Chandrababu Still Fighting-Telugu Politics

ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా తెదేపా టార్గెట్ గా పని చేస్తుంది చంద్రబాబుకు వరుస షాకులను ఇస్తుంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పార్టీ నేతలు చేసిన అవినీతిని బట్టబయలు చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇక ఇంతే కాదు తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో కేటాయించింది భూమిని తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు.
**ముఖ్యమంత్రి జగన్ కు వైకాపా నేతలు లేఖలు ‘
తెదేపా ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించిన భూమి రద్దు చేయాలని వైకాపా నేతలు పట్టుబడుతున్న తీరు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది గత ప్రభుత్వ హయాంలో అత్యంత విలువైన భూములను అడ్డగోలుగా నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం అతి తక్కువ ధరకు తెదేపాకి కేటాయించిందని ఇక దానిని రద్దు చేయాలని ఒక వైకాపా ఎంపీ ఎమ్మెల్యే ప్రభుతానికి లేఖ రాసారు. తెదేపా ప్రధాన కార్యాలయం కోసం చేసిన భూ కేటాయింపు ఉత్తర్వ్యులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు.
**పరిశీలించాలని రెవెన్యు శాఖకు సిపార్సు
దీనిపై ముఖ్యామంత్రి కార్యాలయం స్పందించకపోవడంతో పాటు దానిని రెవెన్యు శాఖ కార్యదర్శి పరిశీలనకు పంపింది. ఇక దీనిపై ఇప్పుడు రెవెన్యు శాఖ కసరత్తు మొదలు పెట్టింది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం అత్మకూరులోని 3.65 ఎకరాల భూముని తెదేపా ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ 2017 జూన్ 22న ప్రభుతం ఉత్తర్వ్యులు జీవో 22జారీ చేసింది. ఈ భూమిని 99ఎల్లుపాటు లీజు ప్రాతిపదికన నాటి ప్రభుత్వం కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.వెయ్యి లీజు ఫీజుగా నిర్ణయించి జరిపిన భూ కేటాయింపు పై ఇప్పుడు దుమారం రేగింది.
*నిబంధనలకు విరుద్దంగా జరిగిందని ఆరోపణ
ఇక నాటి ఉత్తర్వ్యులలో భూమిని కేటాయిచిన తరువాత మూడేళ్ళలో భూమిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంని ఉత్తర్వ్యుల్లో ఉంది. ఏడాదిలో ఒకే భావన నిర్మాణం పూర్తీ చేయాలని షరతు కూడా ఉంది ఇక ఈ నేపద్యంలో అత్యంత విలువైన భూమిని 99 ఏళ్ల నిబంధనలకు విరుద్దంగా లీజుకు ఇవ్వడం ఆలాగే ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున ఫీజుగా నిర్నయైంచడం నాటి ప్రభుత్వ అక్రమాలకు నిదర్శనమని చైకాపా ఆరోపిస్తుంది ఆభూమికి సంబందించిన కేటాయింపులు రద్దు చేయాలని పేర్కొంటుంది.