తనను ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు 2009 నుంచి 2018 మధ్య ఇచ్చిన బోనస్‌లు, స్టాక్‌లు వాపస్ తీసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఈవో చందాకొచ్చర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ మకరంద్ కార్నిక్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం డిసెంబర్2వ తేదీన వాదనలు విననుంది. దీంతో మాజీ సీఈవో, ఐసీఐసీఐ బ్యాంకుకు మధ్య న్యాయపోరాటం తలెత్తినట్లైంది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై గతేడాది దుమారం చెలరేగింది. దీంతో బ్యాంక్ బోర్డు తాత్కాలికంగా కొచ్చర్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. కానీ, ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడంతో జూన్6న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణను దీనిపై దర్యాప్తు చేయడానికి నియమించింది. ఆ తర్వాత ఆమెను తొలగిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీంతోపాటు ఆమెకు చెల్లించాల్సిన బోనస్‌లు, ఇతర మొత్తాలను నిలిపివేయడంతోపాటు ఏప్రిల్ 2009 నుంచి 2018 మార్చి వరకు చెల్లించిన బోనస్‌లను వాపస్ చేయాలని కోరింది.
నా బోనస్‌లు లాగేసుకుంటున్నారు
Related tags :