ScienceAndTech

సింగపూర్ చెప్పింది. ఫేస్‌బుక్ నోటీసులు ఇచ్చింది.

Facebook Issues Notices For Fake News Over Singapore's Request

తప్పుడు వార్తల వ్యాప్తిని ఫేస్‌బుక్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. సింగపూర్‌ ప్రభుత్వం తప్పుడు వార్తల ప్రచారంపై కఠిన చట్టం తీసుకురావడంతో ఈ మేరకు స్పందిస్తోంది. వాక్‌ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో తొలిసారి శనివారం సింగపూర్‌ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఒక తప్పుడు పోస్టుకు ఫేస్‌బుక్‌ సవరణ నోటీసు జారీ చేసింది. ‘‘తప్పు జరిగినట్లు మీకు చెప్పాల్సిన బాధ్యత చట్టపరంగా ఫేస్‌బుక్‌ది. ఈ పోస్టులో అసత్య సమాచారం ఉందని సింగపూర్‌ ప్రభుత్వం పేర్కొంటోంది.’’ అని ఆ నోటీస్‌లో పేర్కొంది. ఇది సింగపూర్‌లోని కొందరు ఫేస్‌బుక్‌ ఖాతాదారులకు అందింది. ఈ నోటీసులను పోస్టు కింద ఎంబెడ్‌ చేస్తారు. ఖాతాదారునికి తప్ప సింగపూర్‌లో, సింగపూర్‌ బయటగానీ ఇతర వినియోగదారులకు కనిపించదు. దీనిపై శుక్రవారంమే సింగపూర్‌ ప్రభుత్వం స్పందించింది. ‘‘సింగపూర్‌ చట్టం ప్రకారం ఫేస్‌బుక్‌ ఆయా తప్పుడు పోస్టుల కింద నోటిస్‌లను అనుసంధానించాలి. వీటిల్లో సింగపూర్‌ ప్రభుత్వం ఈ పోస్టులోని విషయాలు అసత్యాలని ధ్రువీకరించిన అంశాన్ని వెల్లడించాలి. కొత్త చట్టం ఇప్పుడే అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎటువంటి ఇబ్బంది రానీయం’’ అని సింగపూర్‌ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.