తెలంగాణ రాష్ట్ర సాదనలో ముఖ్య ఘట్టం అయినటువంటి “కేసీఆర్ దీక్షా దివస్” సందర్బంగా తెరాస ఎన్ ఆర్ ఐ కో- ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపుమేరకు మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు శ్రీ చిరుత చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోం అసోసియేషన్ ని సందర్శించి అక్కడి చిన్నారులకు కావాల్సిన స్టేషనరీ మరియు పండ్లు పంచడం జరిగింది. మరియు వారి ఆర్థిక అవసరాలనిమిత్తం 1000 రింగెట్ల (సుమారు 20000 రూపాయలు) నగదు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి మరియు ఇతర సభ్యులు ఓంప్రకాష్ బెజ్జంకి, శ్యామ్, సంతోష్ రెడ్డి , అంజి రెడ్డి పాల్గొనడం జరిగింది.