DailyDose

పెళ్లికి ఒప్పుకోలేదని 9మందితో హత్యకు పథకం-నేరవార్తలు-11/30

Murder Plan For Not Marrying-Telugu Crime News-11/20

* చంద్రబాబు బస్ పై చెప్పులు విసిరిన ఘటనపై ఇద్దరి పై కేస్ నమోదు చేసిన తుళ్లూరు DSP శ్రీనివాస్ రెడ్డి మందడం గ్రామని చెందిన గూడూరు.బాపయ్య(ఒచ్),శృంగాపాటి.సందీప్(స్చ్) 362,341,290, సెక్షన్ల క్రింద కేసు నమోదు

* గుంటూరు జిల్లా తుళ్లూరు Mlc అశోక్ బాబు కామెంట్స్ పోలీస్ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది అందుకే ఇక్కడే ఫిర్యాదు చేస్తున్నాం కోడి కత్తి కేసులో ఏపీ పోలీస్ లపై నమ్మకం లేక తెలంగాణాలో కేస్ పెట్టారు ప్రతిపక్ష నేత పర్యటన ప్రాంతంలో వైసీపీ నిరసన చెయ్యడానికి అనుమతి ఎలా ఇచ్చారు దోషులను పట్టుకోలేకపోతే, డీజీపీ ఆఫీస్ ముందే నిరసన చెయ్యడానికి మాకు అనుమతి కావాల్సిందే. ఎమ్యెల్యే నిమ్మల రామానాయుడు కామెంట్స్ ప్రతిపక్ష నేత ఉన్న బస్ పై చెప్పులు, రాళ్లు ,కర్రలు విసిరారు 14 ఏళ్ల సీఎం గా చేసిన అనుభవం,25 ఏళ్ల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పై చెప్పులు విసిరితే మంత్రులు సంతోషించారు జడ్ ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తి పై చెప్పులు విసరడం న్యాయమా..? పోలీస్ ల చేతిలో ఉండాల్సిన లాఠీలు ,వైసీపీ కార్యకర్తల కి ఏలా వచ్చాయో చెప్పాలి వైసీపీ కార్యకర్తలు నిరసన చేసుకో మని dsp అనడం విడ్డురంగా ఉంది తూర్పుగోదావరి లో చంద్రబాబు పర్యటిస్తున్నప్పుడు మా టీడీపీ కార్యకర్తలని కూడా కలవనివ్వకుండా పోలీస్ లు అడ్డుకున్న విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ వైసీపీ రైతులు,కార్యకర్తలు నిరసన తెలపడానికి అనుమతి ఎలా ఇచ్చారో చెప్పాలి.

* మహిళల రక్షణ కోసం మంచి సర్వీస్ ప్రారంభించారు మీరు ప్రయాణించే కార్, క్యాబ్, ఆటో, నెంబర్ ను 9969777888 కు ఎస్సెమ్మెఎస్ చెయ్యండి… మీకు ఒక ఎస్సెమ్మెఎస్ వస్తుంది …. అంటే మీ ప్రయనంచేసే వాహనం ఘ్ఫృశ్ కు అనుసంధానం అవుతుంది. మరింతమంది ఆడపడుచులకు ఈ సమాచారం చేరే వరకు మీడియా మిత్రులు తోడ్పడగలరు

* నల్లమల్ల అడవుల్లో మావోయిస్ట్‌ల సంచారం ఏమాత్రం లేదని గుంటూరు రేంజ్‌ ఐజి వినీతి బ్రిజ్‌లాల్‌ స్పష్టంచేశారు. శుక్రవారం కందుకూరు వచ్చిన ఆయన సర్కిల్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన ఆయన మావోయిస్ట్‌ల కదలికలు రాష్ట్రంలో ఎక్కడా లేవని అన్నారు. కేవలం ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే మావోయిస్ట్‌లు తమ ప్రభావాన్ని చూపుతున్నారని అన్నారు. మావోయిస్ట్‌ల కదలికలపై గట్టినిఘా పెట్టిఉంచామని, రాష్ట్రంలో వారి ఉనికి ఏమాత్రం లేకుండా చేయడం కోసం కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని చెప్పారు. మావోయిస్ట్‌లను పూర్తిగా ఏరిపారేయడంలో రాష్ట్ర పోలీస్‌ సఫలమైందని అన్నారు. పోలీసు శాఖలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలకు మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు. ముఖ్యంగా సిబ్బందిలో నూతనోత్సాహం కలిగించేలా ప్రభుత్వ ప్రకటించిన వారాంతపు శెలవు విధానం పూర్తిగా అమలయ్యేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. ఆ విధానం అమలులో కొన్ని ఇబ్బందులు ఎదరవుతున్నప్పటికీ ప్రభుత్వ లక్ష్యాన్ని అమలుచేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలపట్ల సానుకూలంగా స్పందించేందుకోసం చేపట్టిన ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం సత్ఫలితాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ విధానం వలన పోలీసు శాఖకు మంచి పేరు రావడమే కాకుండా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రకాశంజిల్లా ఎస్పీ శిద్ధార్ధ కౌశిల్‌ పనితీరు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. వినూత్న శైలిలో ఎస్పీ శిద్ధార్ధ కౌశిల్‌ చేపడుతున్న విధానాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణమని అభినందించారు. శిద్ధార్ధ కౌశిల్‌ పనితీరును గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను ఢిల్లిద్కి పిలిపించి అభినందించడమే అందుకు తార్కాణమని అన్నారు. గుంటూరు రేంజ్‌లోని ముఖ్యమైన పోలీసు స్టేషన్లన్నింటిని అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని అన్నారు. అందులో భాగంగా కందుకూరు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కూడా అప్‌ గ్రేడ్‌ చేయడం జరుగుతుందని అన్నారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి ఎస్‌.హెచ్‌.ఓగా ఉండేలా కందుకూరు టౌన్‌ పోలీసు స్టేషన్‌ను త్వరలో అప్‌గ్రేడ్‌ చేయడం జరుగుతుందని తె లిపారు. ఐజి స్థాయిలో వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తొలిసారి కందుకూరు రావడంతో పోలీసు అదికారులు సాంప్రదాయ రీతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

* ఫేస్‌బుక్‌లో ఓ మహిళతో ఆ యువకుడికి పరిచయమైంది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. వయసు తేడా కారణంగా ఇంట్లో అంగీకరించరని ఆ యువకుడు సమాధానం చెప్పాడు. దీంతో కక్ష పెంచుకున్న మహిళ… అతణ్ని హత్య చేసేందుకు తొమ్మిది మందిని పంపింది. ఈలోగా వారి కుట్ర బయటపడి పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం మేరకు… తేని వీరపాండి సమీపం కాట్టునాయక్కన్‌పట్టి ప్రాంతానికి చెందిన వ్యక్తి అశోక్‌కుమార్‌ (28). బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఆయన పని చేసేవారు. ఫేస్‌బుక్‌ ద్వారా మలేషియాకు చెందిన అముదేశ్వరి ఆయనకు పరిచయమైంది. ఇద్దరూ స్నేహాన్ని కొనసాగించారు. వారి మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను వివాహం చేసుకోవాలని అశోక్‌కుమార్‌ను అముదేశ్వరి కోరింది. అయితే తనకంటే ఎక్కువ వయసు ఉన్నందున ఇంట్లో అంగీకరించరని ఆయన చెప్పారు. తర్వాత మలేషియా నుంచి కవిత అనే మహిళ అశోక్‌కుమార్‌తో మాట్లాడింది. తాను అముదేశ్వరి సోదరినని పరిచయం చేసుకుంది. వివాహానికి నిరాకరించటంతో అముదేశ్వరి ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. ఈ విషయం అశోక్‌కుమార్‌ పని చేసే సంస్థకు కూడా చేరవేసింది. దీంతో అశోక్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. తర్వాత ఆయన సొంత గ్రామానికి తిరిగొచ్చారు. మలేషియా నుంచి తేనికి వచ్చిన కవిత తనను వివాహం చేసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని అశోక్‌కుమార్‌ను బెదిరించింది. దీని గురించి తేని ఎస్పీకి అశోక్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు. అముదేశ్వరి, కవిత ఒక్కరేననే విషయం వెల్లడైంది. ఆమె అసలు పేరు విఘ్నేశ్వరి (45) అని తెలిసింది. ఆమెను పోలీసులు హెచ్చరించి పంపారు. దీన్ని మనసులో పెట్టుకుని అశోక్‌కుమార్‌ను హత్య చేయించాలని విఘ్నేశ్వరి నిర్ణయించుకుంది. ఇందుకు ఫేస్‌బుక్‌ ద్వారా తేనికి చెందిన తొమ్మిది మందిని సంప్రదించింది. నగదు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. వారికి అశోక్‌కుమార్‌ ఫొటో, ఫోన్‌ నెంబరు పంపింది. ఆ తొమ్మిది మంది బోడిలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. వారి ప్రవర్తనపై అనుమానం రావటంతో లాడ్జి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

* జిల్లా ఆత్మకూరులో ఆయిల్‌ దొంగలు పట్టుబడ్డారు. ముంబై హైవేపై ఆగి ఉన్న లారీల నుంచి ఆయిల్‌ దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పారిపోతుండగా వెంబడించి పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి వాహనం, ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

* ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిందంటూ ఓ యువతి 100కు డయల్ చేస్తే స్పందించిన పోలీసులు పెట్రోలు తెచ్చి పోశారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. రాచకొండ పోలీసులు ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వరుస అత్యాచార ఘటనలతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌లో  పోలీసులు ఇప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రాచకొండ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ యువతి డయల్ 100కు కాల్ చేసి బండిలో పెట్రోలు అయిపోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలు బాటిల్‌తో యువతి వద్దకు చేరుకున్నారు. స్కూటీ వాహనంలో పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు. రాచకొండ పోలీసులు ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. యువతి ఫోన్‌‌కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

* ఇటీవల సినీనటుడు రాజశేఖర్‌ ప్రయాణిస్తున్న కారు బాహ్య వలయ రహదారిపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు బాహ్యవలయ రహదారిలో 21సార్లు అతివేగంతో వెళ్లినట్లు సీసీకెమెరాల ఆధారంగా గుర్తించారు. అత్యధికంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన డ్రైవింగ్‌ లైసెన్సును రద్దుచేయాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ సిఫార్సు చేశారు. నాలుగైదు రోజుల్లో ఆయన లైసెన్సు రద్దయ్యే అవకాశముంది…

* శంషాబాద్ సిద్దులగుట్ట దగ్గర మహిళ మృతి కేసును పోలీసులు వేగవంతం చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో క్లూస్ టీమ్స్ కొన్ని ఆధారాలు సేకరించాయి. ఘటన జరిగిన చోటు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపు డాగ్ స్క్వాడ్ వెళ్లింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మహిళకు సంబంధించిన వివరాలు తీసుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. గుడిలో ఉన్న స్వాములను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మహిళ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మహిళకు సంబంధించిన కాలిపోయిన చీర, గాజులు, చెప్పులు, మరికొన్ని వస్తువులను క్లూస్ టీమ్స్ సేకరించాయి. నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పాపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే శంషాబాద్ చుట్టుపక్కల రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సిద్ధులగుట్ట వచ్చే రోడ్డులో ఉన్న సీసీ టీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

* రణస్థలం మండలం బంటుపల్లి వద్ద గల యునైటెడ్ బ్రేవెరీస్ పరిశ్రమ యాజమాన్యం శనివారం ఉదయం 6గంటలకు హాజరైన కార్మికులను విధుల్లోకి అనుమతించకుండా  సెల‌వు ప్ర‌క‌టించింది. సెక్యూరిటీ సిబ్బంది గేట్లు మూసివేశారు. యాజమాన్యం దుర్మార్గనికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో గేట్ ముందు బైఠాయించి కార్మి‌కులు నిర‌స‌న తెలియ‌జేశారు.