Movies

వ్యాఖ్యాత పారితోషికం ₹200కోట్లు

salman-khan-remunneration-for-bigg-boss-season-13-is-200crores

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 13’. ఈ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకుగాను సల్మాన్‌ రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని బాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ‘బిగ్‌బాస్‌ సీజన్‌4’ నుంచి సల్మాన్‌ ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే అప్పటినుంచి ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌ 13 వరకూ ఆయన పారితోషికం ప్రతి సీజన్‌కు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌కుగాను సల్మాన్‌కు వారానికి రూ.13కోట్లు (అనగా ఎపిసోడ్‌కు రూ.6.5కోట్లు) పారితోషికం ఇస్తున్నారు. అయితే ఇటీవల ఆ షోను మరో ఐదు వారాలపాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనకు ఎపిసోడ్‌కు రూ.2 కోట్ల చొప్పున రెమ్యూనిరేషన్‌ను పెంచారట. సల్మాన్‌ ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 13’లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు రూ.200 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.