Food

జిగురు అని మానేయొద్దు. చామదుంపలు బాగా తినాలి.

Taro Root Arbi Yam Must Be Taken In Diet-Telugu Food And Diet News

చాలా మంది సహజంగానే చామదుంపలు బాగా జిగురుగా ఉంటాయనే కారణంతో వాటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. చామ దుంపలను ఎలాగైనా మనం తరచూ తీసుకోవచ్చు. వాటితో మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…

* చామదుంపల ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే ఇతర దుంపల్లా వీటిని తినగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. చాలా నెమ్మదిగా గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ దుంపలను తినవచ్చు.

* అధిక బరువు తగ్గాలనుకునే వారు చామదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక వీటిని తినడం వల్ల గుండెకు కావల్సిన పోషకాలు అందుతాయి. చామదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

* ఈ దుంపల్లో ఉండే విటమిన్ బి6 హైబీపీని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. మహిళల్లో మెనోపాజ్‌లో వచ్చే సమస్యలు తగ్గాలంటే చామ దుంపలను తినాలి.

* గర్భిణీలు చామదుంపలను తినడం వల్ల వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం తదితర లక్షణాలు తగ్గుతాయి.

* చామదుంపల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది.