ఎత్తు తక్కువగా ఉన్నవారు… తమ ఆహార్యంలో చేసుకునే చిన్నచిన్న ప్రయత్నాలతో కాస్త పొడుగ్గా కనిపించొచ్చు. అదెలాగంటే…
దుస్తుల ఎంపిక: కుర్తాలు ఎక్కువగా వేసుకునేవారు దాని పొడవు మోకాళ్లు దాటి ఉండేలా చూసుకోవాలి. ఈ మార్పుతో కాస్త పొడుగ్గా కనిపిస్తారు. ఇలాంటివారికి గుండ్రటి, ఆంగ్ల యు ఆకారం, హృదయాకృతిలో ఉండే మెడ డిజైన్లు అదిరిపోతాయి. బంద్‌గలా, చోకర్ తరహాలో మెడను చుట్టేసినట్లుండే డిజైన్లు వేసుకోకపోవడమే మంచిది. ఇంకా ఎత్తు తక్కువగా కనిపిస్తారు.
చిన్న ప్రింట్లు: కొందరు పెద్ద ప్రింట్లు ఎంచుకుంటారు కానీ… వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇదే సూత్రం అంచులకీ వర్తిస్తుంది. సన్నగా, తక్కువ ఎంబ్రాయిడరీతో ఉండేవాటిని ఎంచుకోవాలి. ఇలాంటివారికి షిఫాన్, జార్జెట్, నూలు మేళవించిన వస్త్రాలు బాగుంటాయి. దుస్తులు శరీరానికి అతికినట్లుగా ఉండేలా చూసుకోవాలి.
ప్యాంట్లు: ఎత్తు తక్కువగా ఉన్నవారికి స్లిమ్‌ఫిట్ జీన్స్, పలాజోలు అదిరిపోతాయి. వాటితోపాటు కనీసం రెండు అంగుళాల ఎత్తున్న చెప్పులు వేసుకుంటే తిరుగుండదు. యాక్సెసరీలు మాత్రం మితంగా వేసుకుంటే బాగుంటుంది. అప్పుడే పొడుగ్గా కనిపిస్తారు.