ఉత్తరప్రదేశ్‌లోని సికందర్‌పూర్ సరౌసిలోని ఓ ప్రభుత్వ పాఠశాలను గురువారం జిల్లా మెజిస్ర్టేట్ దేవేంద్ర కుమార్ పాండే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ తరగతి గదిలో విద్యార్థులను ఇంగ్లిష్ పుస్తకంలోని కొన్ని లైన్లను చదవమని కోరారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లిష్ టీచర్‌ను కూడా ఆయన పుస్తకంలోని కొన్ని లైన్లను చదవమని ఆదేశించారు. ఆమె కనీసం రెండు లైన్లు కూడా సరిగా చదవలేకపోయారు. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు ఆయనకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. ఆయన ఆమెను విధుల్లో ఉంచడానికి ససేమిరా అన్నారు. ఇలాంటి వారు విధుల్లో ఉంటే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని చెప్పి ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించారు.
ఇంగ్లీషు టీచరమ్మకు జడ్జి గారి శిక్ష
Related tags :