ముఖంపై చూపే శ్రద్ధ మెడపై చూపరు కొందరు. దాంతో ఆ ప్రాంతమంతా నల్లగా మారుతుంది. ఈ సమస్యను ఎలా వదిలించుకోవచ్చంటే…
* పచ్చి బొప్పాయి ముద్దలో చెంచా చొప్పున గులాబీ నీరు, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి… పావుగంటయ్యాక కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే మెడ నలుపుదనం తగ్గుతుంది.
* చెంచా చొప్పున నిమ్మరసం, తేనె తీసుకుని రెండింటినీ కలిపి మెడకు రాసుకోవాలి. తరువాత మృదువుగా మర్దన చేసి… పది నిమిషాలయ్యాక కడిగేయాలి. తేనె తేమనందిస్తే, నిమ్మరసం నలుపును పోగొడుతుంది.
* రెండు చెంచాల వంటసోడాలో కాసిని నీళ్లు కలిపి మెడకు రాసుకోవాలి. అయిదు నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసినా ఫలితం ఉంటుంది.
* రెండు చెంచాల సెనగపిండిలో చెంచా నిమ్మరసం, కాసిని పాలు కలిపి మెడకు రాసుకోవాలి. పది నిమిషాలు మృదువుగా మర్దన చేసి తరువాత కడిగేస్తే చాలు.