రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌కు టాటా చెప్పేస్తున్నారంటూ గత కొంతకాలం నుంచి కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. రకుల్ హైదరాబాద్‌లో ఉన్న తన ఇంటిని అతి తక్కువ ధరకు విక్రయించి, బెంగళూరులో ఓ అందమైన ఇంటిని కొనుగోలు చేశారంటూ పలు పత్రికల్లో పేర్కొన్నారు. దీంతో రకుల్ ట్విటర్ వేదికగా తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ‘కొందరు జర్నలిస్ట్‌లకు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో. నేను హైదరాబాద్‌లో ఇల్లు కొన్నప్పుడు.. ఆ ఇంటిని నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు.. నేను హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని అమ్మేసి బెంగళూరులో ఇల్లు కొనుకున్నానని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలు రాసే వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. అవాస్తవాలను ప్రచారం చేయడం ఆపండి. నిజమైన వార్తలను తెలియచేయండి’ అని రకుల్ పేర్కొన్నారు.
ఎందుకురా అబద్ధాలు ప్రచారం చేస్తారు?
Related tags :