నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో 9వ బాలల సంబరాలు స్థానిక కూడీ అకడామీలో 12గంటల పాటు ఘనంగా నిర్వహించారు. వందలాది మంది ప్రవాస బాలబాలికలుఈ కార్యక్రమంలో పాల్గొని గణితం, చదరంగం, తెలుగు పదకేళి వంటి పోటీల్లో తమ ప్రతిభలను ప్రదర్శించారు. సాఫ్ట్ స్కూల్స్ తరఫున గూడవల్లి మణిధర్ పిల్లలకు గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. USCF స్థానిక చాఫ్టర్ సహకారంతో నిర్వహించిన చదరంగం పోటీలో 90 మంది పిల్లలు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంచేందుకు వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాలు నిర్వహిస్తుందని నాట్స్ ఉపాధ్యక్షులు శేఖర్ అన్నే ఆన్నారు. నాట్స్ చేసే వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించి అందరిని భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరారు. డాలస్ విభాగ కార్యదరి అశోక్ గుత్తా,కిషోర్ వీరగంధం ఈ పోటీలను సమన్వయపరిచారు. విభాగ కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి మండల, ప్రేమ్ కలిదిండి ,భాను లంక, కృష్ణ వల్లపరెడ్డి,శ్రీధర్ న్యాలమడుగుల, కిరణ్ జాలాది, దేవీప్రసాద్, విజయ్ కొండా, వెంకట్ పోలినీడు,వెంకట్ కొయలమూడి, నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కిషోర్ కంచర్ల, రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, జ్యోతి వనం తదితరులు పాల్గొన్నారు. స్థానిక సాఫ్ట్ స్కూల్స్.కామ్, స్పా ర్కల్స్ మరియు బావార్చి బిర్యానీ పాయింట్ తగిన సహకారాన్ని అందించారు.