2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్ తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె మంగళవారంతో ముగించారు. ‘‘నా మద్దతుదారులకు ఇది చాలా విచారకరం. ఈ రోజు నేను నా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాను. కానీ మీతో ఒక విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. ప్రజల కోసం నిరంతం పోరాటం చేస్తూనే ఉంటానని’’ కమలా హ్యారిస్ ట్విట్ చేశారు. తను తీసుకున్న నిర్ణయం చాలా కష్టతరమైనదని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె మంగళవారం ఉదయం తన సీనియర్ సిబ్బందికి ఈ నిర్ణయం గురించి తెలిపారు. అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి ట్విట్ చేశారు. డెమోక్రటిక్ పార్టీలో కీలక నేతగా మారిన కమలా హ్యారీస్ ఒకానొక సమయంలో అధ్యక్ష పదవికి ప్రముఖ పోటీదారుగా నిలిచారు. అయితే ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడానికి ఆర్థిక ఒత్తిళ్లు దారితీశాయని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘నేను బిలియనీర్‌ను కాదు. సొంత ప్రచారానికి నిధులు సమకూర్చే పరిస్థితుల్లో లేను. ప్రచారం కొనసాగుతున్న కొద్దీ, మనం పోటీ పడటానికి అవరసరమైన నిధులు సేకరించడం కష్టంతో కూడుకున్న పని అని’’ అమె తన మద్దతుదారులకు తెలిపారు. సెనెటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్రకెక్కారు.
డబ్బుల్లేవ్…అందుకే వైదొలుగుతున్నాను-కమలా హ్యారిస్
Related tags :