DailyDose

కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు-నేటి తాజా వార్తలు- 03/12

Income Tax Notices To Congress Party-Telugu breaking News-12/03

* పన్ను ఎగవేతకు పాల్పడిన ఓ కంపెనీ నుంచి విరాళాలు స్వీకరించిన వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. రూ. 3,300 కోట్ల హవాలా అక్రమాలకు పాల్పడిన హైదరాబాద్‌కు చెందిన సంస్థ నుంచి కాంగ్రెస్‌ రూ. 170కోట్ల వరకు విరాళాలు స్వీకరించినట్లు ఈ నోటీసుల్లో ఐటీశాఖ తెలిపింది. దీనిపై సమాధానం చెప్పాలని సూచించింది.
* పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. సోమవారం రాత్రి దుబాయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ముషారఫ్‌ చేరినట్లు తెలిపింది.
* ఉత్త‌రాదిలో చ‌లి చంపేస్తోంది. శీత‌కాల ఉష్ణోగ్ర‌త‌లు వ‌ణుకు పుట్టిస్తున్నాయి. క‌శ్మీర్‌, ల‌డాఖ్‌లో ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ‌లాడుతున్నారు. ల‌డాఖ్‌లోని లేహ్ ప‌ట్ట‌ణంలో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త న‌మోదు అయ్యింది.
* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి ఇండియా.. 2020 జనవరి నుంచి తమ కంపెనీ వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
* చంద్రబాబు కర్నూలులో రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యాంగులకు మొదటి నుంచి అండగా ఉన్నది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 640 దాడులు జరిగాయన్నారు.
* 1934కు ముందు ఈ దేశంలో జీడీపీ అనేదే లేదని భవిష్యత్‌లో కూడా దాని అవసరం ఉండబోదని బీజేపీ ఎంపీ నిషికాంత్ దాస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు.
* విజయవాడ,ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ నందుసైబర్ స్పేస్ లో మహిళల భద్రతఅనే కార్యక్రమం లో పాల్గొన్న మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత,హోమ్ శాఖ మంత్రి మేకతోటి సూచరిత గారు, మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు,డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు,యుక్త వయసు లో ఉన్న బాలికలు 2000 మందిదాకా పాల్గున్నారు
* జమ్మూ-కశ్మీరుల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని, అధికరణ 370ని రద్దు చేసినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
* వందల ఏళ్లుగా పాకిస్తాన్ సీక్రెట్గా దాచిన బుద్ధుడి విగ్రహమిది.. మూడో శతాబ్దం, నాలుగో శతాబ్దం మధ్యలో ‘స్టుకో’తో తయారైన ఈ అరుదైన విగ్రహాన్ని ఆదివారం బయటికి తీశారు. ఇస్లామాబాద్లోని మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. స్టుకోతో బుద్ధుడి విగ్రహాన్ని తయారుచేయడమే అరుదంటే.. ఈ విగ్రహంలో పొడవాటి జుట్టు వెనక్కి దువ్వినట్లు ఉండడం మరింత విచిత్రమని మ్యూజియం నిర్వాహకులు చెప్పారు.
* ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సిబ్బంది వరకు అవినీతి జరుగుతూనే ఉంది. ప్రభుత్వం, కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారి అత్యాశకు అంతులేకుండా పోతుంది. నాగర్ కర్నూల్ మైనింగ్ కార్యాలయంలో ఇవాళ ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏడీ శ్రీనివాస్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
*1934కు ముందు ఈ దేశంలో జీడీపీ అనేదే లేదని భవిష్యత్‌లో కూడా దాని అవసరం ఉండబోదని బీజేపీ ఎంపీ నిషికాంత్ దాస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడలేవని, భారత ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
*క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన డిజిపి గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ విశ్వజిత్ భేటీ..
రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చ..
*బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది.విశాఖపట్నం నగరానికి చెందిన బీజీపీకి చెందిన నేతలు, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు.కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా పనికి రాడు..వారి నియోజకవర్గంలో బీజీపీకి ఎన్ని ఓట్లు పోలైనాయి అని ప్రశ్నించారు.వారి ఆస్తులను కాపాడుకునేందుకు బిజిపిలోకి వచ్చారని అంటున్న నేతలు.
వారివాళ్ళ ఒక్క ఓటు కూడా రాదని అంటున్న బిజిపి సీనియర్లు.
*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హస్తినకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను అక్కడి జాతీయ మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ ఆయన్ను నిలదీశారు. అయితే మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే సీఎం కేసీఆర్ అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో కేసీఆర్ ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీకి వచ్చారంటూ జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
*తొలిసారి బ్రాడ్ కాస్టింగ్ అడిఎంస్ రీసెర్చ్ కౌన్సిల్ రెండు తెలుగు చానెళ్ళ రేటింగ్ గోల్ మాల్ వ్యవహారం పై కేసు పెట్టింది. బార్క్ పెట్టిన కేసు ఆధారంగా వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసారు.
* మంగళగిరి మండలం యర్రబాలేనికి చెందిన యలమంచిలి పద్మ అనే మహిళా రైతు అదృశ్యమైంది. గత నెల 26న రాజధానిపై స్పష్టత కోసం యర్రబాలెంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
* విజయవాడలోని పున్నమి ఘాట్‌లో క్రైస్తవ మత మార్పిడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 47 మందికి మతమార్పిడి కార్యక్రమం నిర్వహించారు. లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ మత మార్పిడి తతంగం జరగడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* ఫలక్‌నుమాలో కానిస్టేబుల్ ఈశ్వరయ్య మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. నడిరోడ్డుపై ఓ వాహనానికి ఆనుకుని పడుకొని ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగించాడు. ఇదేమని ప్రశ్నించిన వాహనదారులపై చిందులు వేశాడు. విషయం తెలుసుకున్న సీపీ అంజనీకుమార్ మద్యం సేవించి నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసిన ఈశ్వరయ్యను సస్పెండ్ చేశారు. అలాగే కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఫలక్ నుమా సీఐ పట్టించుకోలేదన్న కారణంతో ఆయనకు సీపీ మెమో ఇచ్చారు.
* దిశ’ అమానవీయ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయడంతో పాటు యువతులు, మహిళల భద్రతపై అవగాహన నేర్పింది. ఆపద సమయాల్లో బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసేకన్నా ముందుగా ‘హాక్‌ ఐ’ మొబైల్‌ అప్లికేషన్‌లోని ఎస్‌.ఒ.ఎస్‌(సేవ్‌ అవర్‌ సోల్‌) మీటను నొక్కితే చాలు అంటూ పోలీస్‌శాఖ ప్రచారం చేయడం సత్ఫలితాలనిచ్చింది.
* విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకీ చిక్కింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న విక్ర‌మ్ శిథిలాల‌ను నాసా గుర్తించింది. దానికి సంబంధించిన దృశ్యాల‌ను నాసా సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. చంద్ర‌యాన్‌2 ద్వారా విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను ప్‌ంయోగించిన విష‌యం తెలిసిందే. అయితే సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ స‌మ‌యంలో విక్ర‌మ్ అదుపు త‌ప్పింది.
* భారతరత్న స్వర్గీయ శ్రీ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భముగా ఘన నివాళి..న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి, స్వాతంత్య్ర సమరయోధునిగా కీలకపాత్ర పోషించి, 1948 నుండి 1950 వరకుభారత రాజ్యాంగ ముసాయిదా తయారీ సంఘానికి అధ్యక్షునిగా… స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతిగా (1950-62)సుదీర్ఘ కాలం బాధ్యతలను నిర్వర్తించారు డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌. పలు భాషల్లో పండితులైన రాజేంద్రప్రసాద్‌ ఇండియా డివైడెడ్‌, ఎట్‌ ద ఫీట్‌ ఆఫ్‌ మహాత్మ, హిస్టరీ ఆఫ్‌ చంపారన్‌, సిన్స్‌ ఇండిపెండెన్స్‌, సత్యాగ్రహం అనే రచనలతో పాటు తన ఆత్మకథను కూడా రచించారు. 1962లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు.
*ఆస్ర్టేలియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు నగరానికి చెంది న సీనియర్ జర్నలిస్ట్ అరవింద్కుమార్ కొల్లి కుమార్తె స్రష్టవాణి కొల్లి ఎంపికైంది. ఈ మేరకు ఆమె దరఖాస్తు పత్రాలను పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు 100శాతం స్కాలర్షిప్ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం బేగంపేటలోని ప్లాజా హోటల్లో స్టడీ పాత్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో యూనివర్సిటీ వివరాలను కన్సల్టెన్సీ ప్రతినిధులు, ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ మేనేజర్ పీటర్ ముర్రే వివరించారు.
*దేశంలోనే అత్యున్నతమైన పౌల్ట్రీ విధానాన్ని రూపొందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. తెలంగాణలో ఎక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నెలకొల్పాలన్నా..ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టడంపై చర్చించామన్నారు. పౌల్ట్రీరంగ అభివృద్ధిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘ తొలి సమావేశం సోమవారమిక్కడ తలసాని అధ్యక్షతన జరిగింది.
*ఏపీఎస్ఆర్టీసీ విభజనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర రహదారి, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ తెలిపారు. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
*తెలుగు భాషాభిమానుల సమావేశాలు, సదస్సులతో ప్రభుత్వ పాలకులు స్పందిస్తారని నేననుకోను. ప్రజా ఉద్యమంతోనే తెలుగుకు వెలుగు సాధ్యం’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
*నీటి పంపిణీపై నిర్ణయం తీసుకోవడానికి మంగళవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
*కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చలనచిత్రానికి సెన్సార్బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు న్యాయవాది బాలాజీ తెలిపారు. సోమవారం హైదరాబాద్ కవాడిగూడలోని సీజీవో టవర్స్లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారులను కలుసుకున్న తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించినందున చిత్రాన్ని ప్రదర్శించడం, ట్రైలర్లు చూపించడం నిషేధమన్నారు.
*వరంగల్ జిల్లా హన్మకొండలోని చైతన్య గ్రూపు విద్యాసంస్థలకు డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదా దక్కింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరులశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా సాధించడమే కాకుండా న్యాక్ ‘ఎ’ గ్రేడ్ పొందిన ఈ కళాశాల 2017 మార్చిలో డీమ్డ్ వర్సిటీ స్థాయి కోసం యూజీసీకి దరఖాస్తు చేసింది.
*జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పశుసంవర్ధక, డెయిరీ, మత్స్యశాఖ మంత్రి ఛైర్మన్గా 13 మంది కేంద్ర, రాష్ట్ర అధికారులు, వివిధ సంస్థలకు చెందిన మరో ఏడుగురు సభ్యులుగా బోర్డును ఏర్పాటు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు
*ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన వివాదం ముగిసిన నేపథ్యంలో కొత్తగా దీనిపై విచారించాల్సిన అంశాలేవీ లేవని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల కార్మికుల ఆత్మహత్యలు నిలువరించేలా చర్యలు చేపట్టడంతోపాటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆచార్య విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
*దిశ హంతకులను బహిరంగంగా ఉరి తీయాలని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి డిమాండ్ చేశారు. సోమవారం ఏబీవీపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్లోర్యాలీ నిర్వహించారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వారిని తోసుకుని ధర్నాచౌక్కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు.నిధి త్రిపాఠి మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు.
*జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖాశర్మ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్లో సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనని మాటల గురించి ఆమె వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఉన్నతస్థానంలో ఉన్న ఆమె స్పందించే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు.
*విజయవాడ రైల్వేస్టేషన్కు ఐఎస్వో గుర్తింపు వచ్చింది. రైల్వేస్టేషన్ను పర్యావరణ హితంగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు రైల్వేస్టేషన్కు ఐఎస్వో 14001:2015 ధ్రువపత్రం వచ్చింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్(ఎన్ఏబీసీబీ) గుర్తింపు పొందిన వెక్సిల్ బీపీఎస్ సంస్థ ఈ ధ్రువపత్రాన్ని సోమవారం జారీ చేసింది.
*అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈఈ) ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. ఈ పరీక్షలు ఆన్లైన్లో మే 14, 15 తేదీల్లో నిర్వహించారు. 3,824 మంది పరీక్షలు రాశారు. వీరిలో ఎంపికయిన 527 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జనవరి 6 నుంచి అదే నెల 10వ తేదీ వరకు జరగనుంది.
*కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు వీలుగా కౌలు రైతులకు సంబంధించిన రుణ అర్హత కార్డులు(ఎల్సీసీ), సాగుదారు ధ్రువీకరణ పత్రాలు(సీఓసీ), పంట సాగుదారు హక్కుల చట్టం(సీసీఆర్సీ) కార్డులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంట కొనుగోలు నిబంధనలు సడలించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు, కార్యదర్శి జమలయ్య సోమవారం సచివాలయంలో వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిసి వినతిపత్రం అందించారు
*తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి, కృష్ణా తీర ప్రాంతాలను హానికారక తీరప్రాంతాలుగా గుర్తిస్తూ 18.1.2019న తీరప్రాంత నియంత్రణ మండలి నోటిఫికేషన్ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు సమీకృత నిర్వహణ ప్రణాళిక ద్వారా ఆయా ప్రాంతాల్లో పర్యావరణాన్ని కాపాడాల్సి ఉందని నోటిఫికేషన్ మార్గదర్శకాల్లో పొందుపరిచినట్లు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో సమాధానమిచ్చారు.
*జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను ఈ నెల ఏడో తేదీలోపు సామాజిక తనిఖీ కోసం సచివాలయం వద్ద ఉంచనున్నారు. దీనిపై 14వ తేదీలోపు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ముసాయిదా జాబితాను గ్రామ సభ ఆమోదించనుంది. తెల్లరేషన్ కార్డు లేని తల్లులు, సంరక్షకుల జాబితాను ఈనెల 8వ తేదీలోపు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా వివరాలు సేకరించనున్నారు
*ఏపీపీఎస్సీ చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అర్హతలకు తగ్గట్టు దివ్యాంగ మహిళా అభ్యర్థులు లేనందున పోస్టులు భర్తీ కావడం లేదని నిరుద్యోగ ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులైన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు లేకుంటే కటాఫ్ మార్కులు తగ్గిస్తున్నారని, ఈ విధానం దివ్యాంగులకూ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరింది.