గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న తెదేపాని మళ్ళీ గాడిన పెట్టేందుకు ఆపార్టీ అధినేత మాజీ సిఎం చంద్రబాబు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తానె స్వయంగా జిల్లాల పర్యటనలు చేస్తున్న చంద్రబాబు క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. అయితే తెదేపాలో మల్లె జవసత్వాలు నింపేందుకు తనతో పాటు బాలకృష్ణ రంగంలోకి దింపాలని చంద్రబాబు భావించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా తెదేపా దరున్మగా దెబ్బతిన్న రాయసీమలో మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే బాద్యతను బాలకృష్ణకు అప్పగించాలని చంద్రబాబు అనుకున్నారు. వైకాపా హావాలోనూ హిందూపురంలో విజయం సాధించిన బాలకృష్ణకు ఈ బాద్యతలు అప్పగిస్తే సత్పలితాలు వస్తాయని తెదేపా అధినేత యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు బాలకృష్ణ నో చెప్పినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కడప పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు తాజాగా కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. రాయలసీమలో పార్టీ వ్యవహారాల బాద్యతలు తీసుకునేందుకు బలర్కిష్ణ విముఖత వ్యక్తం చేయడం వల్లే చంద్రాబు స్వయంగా రంగంలోకి దిగారని తెదేపా వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఎన్నికల నాటికి సీమ రాజకీయాల పై బాలకృష్ణ ద్రుష్టి పెట్టె అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు.
చంద్రబాబు మాట వినని బాలకృష్ణ
Related tags :