ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో సాయిదత్త పీఠంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రవాసులు పెద్దసంఖ్యలో వచ్చి పరీక్షలు చేయించుకుని, ఉచిత వైద్య సేవలు పొందారు. ఉచితంగా కంటి పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు, ఏ1సీ పరీక్షలతో పాటు ఈ శిబిరానికి వచ్చిన వారి కి ఉచితంగా ప్లూ షాట్స్ కూడా అందించడం జరిగింది. స్థానిక వైద్యులు బొల్లు జనార్థన్, సూర్యం గంటి, విజయ నిమ్మ లు తమ విలువైన సమయాన్ని ఈ ఉచిత వైద్య శిబిరం కోసం వెచ్చించారు. ఆండీ ప్లాజా ఫార్మసీ కి చెందిన శ్యాం నాళం, శైలజ నాళం లు శిబిరానికి విచ్చేసిన వారికి ప్లూ షాట్స్ ఉచితంగా అందించారు. లయన్స్ క్లబ్ వారి కంటిపరీక్షలు, అవాంటిక్ ల్యాబ్ ఏ1సీ పరీక్షలు నిర్వహించినందుకు నాట్స్ వారిని ప్రత్యేకంగా అభినందించింది. నాట్స్ చేపట్టిన ఈ ఉచిత వైద్య శిబిరానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సాయిదత్త పీఠంలో శిబిరం ఏర్పాటుకు సహకరించడంతో పాటు శిబిరానికి కావాల్సిన సౌకర్యాలను కూడా సాయి దత్త పీఠం ఏర్పాటు చేసింది. నాట్స్ నాయకులు గంగాధర్ దేసు, మోహన కృష్ణ మన్నవ, అరుణ గంటి, మురళీ మేడిచర్ల, శ్యాం నాళం , రమేశ్ నూతలపాటి, వంశీ వెనిగళ్ల, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, సురేశ్ బొల్లు, రాజేశ్ బేతపూడి, కిరణ్ తవ్వ, శ్రీనివాస్ వెంకట్ తదితరులు ఈ ఉచిత వైద్యశిబిరం విజయవంతానికి కృషి చేశారు.
న్యూజెర్సీలో ఉచిత వైద్య శిబిరం
Related tags :