ఇప్పటివరకు క్రీమ్స్, ఇతర రసాయన పదార్థాలతో అందాన్ని పొందారు. పండ్లు, వంటింటి సామగ్రితో ఇంకా కొందరు బ్యూటీ టిప్స్ ట్రై చేశారు. కానీ ఆకులతో కూడా అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అదెలాగంటే…జామ ఆకులు బ్లాక్ హెడ్స్ సమస్యల్ని దూరం చేస్తాయి. కొన్ని జామ ఆకుల్ని తీసుకొని వాటిని నీటిలో మరిగించాలి. తర్వాత కొద్దిగా పసుపు కలిపి మెత్తని ముద్దగా నూరి ముఖానికి పట్టించి మర్దన చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ తొలిగిపోతాయి. జామ ఆకుల్ని మెత్తగా నూరి కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించాలి. జామ ఆకుల్లో ఉండే బ్యాక్టీరియా మొటిమలను కలుగజేసే కణాలను రాకుండా చేస్తుంది. చర్మంపై ఉండే నల్లని మచ్చలు, మరకల్ని తొలగిస్తుంది. జామ ఆకులు ముఖంపై వచ్చే ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి. తరచూ జామ ఆకుల ముద్దను ఫేస్ప్యాక్గా వాడేవారికి ముఖంపై ముడతలు రావు. వయసు పైబడినట్లుగా కనిపించకుండా అందంగా కనిపిస్తారు. జామ ఆకులను ముద్దగా చేసి ఆ రసాన్ని ముఖంపై రోజూ రాత్రి నిద్రించే ముందు రాసుకోవచ్చు. జామ ఆకుల్ని నీటిలో మరిగించి ఉప్పును కలిపితే వచ్చిన ద్రావణాన్ని నోటి శుభ్రతకు వాడాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నోటి దుర్వాసన పోతుంది. జామ పుల్లలతో పళ్లు తోముకుంటే చిగుళ్ల సమస్యలు నయమవుతాయి.
జామ ఆకులతో బ్లాక్ హెడ్స్ తొలగించవచ్చు
Related tags :