వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారా 400 పరుగుల రికార్డు బద్దలు కొట్టేందుకు తనకు మరో అవకాశం తప్పక దొరుకుతుందని ఆసీస్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ధీమా వ్యక్తం చేశారు. తనను స్వయంగా ఆయన కలిసి అభినందించడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నాడు. అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో వార్నర్ 335 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ వేదికలో బ్రాడ్‌మన్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత లారా రికార్డునూ తుడిచేస్తాడనే అంతా భావించారు. ఆసీస్ సారథి టిమ్‌పైన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో కుదర్లేదు. అద్వితీయ త్రిశతకం బాదిన వార్నర్‌ను లారా ప్రశంసించాడు. తన రికార్డును బద్దలు కొడతాడని భావించినట్టు ఇంతకుముందు చెప్పాడు. అన్నట్టుగానే అతడిని స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా లారాతో కలిసి తీసుకున్న చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘దిగ్గజ క్రికెటర్ స్వయంగా నన్ను కలవడం గొప్ప అనుభూతి. ఏదో ఓ రోజు లారా 400 పరుగుల రికార్డును బద్దలు చేసే అవకాశం మళ్లీ నాకు తప్పక వస్తుంది’ అని వ్యాఖ్య పెట్టాడు. ‘కెరీర్‌లో వార్నర్‌కు ఆ అవకాశం వస్తుందనే అనుకుంటున్నా. అతడు ఎప్పుడో ఓ సారి ఆడే వ్యక్తికాదు. నిలకడగా రాణించే దూకుడైన బ్యాట్స్‌మన్. 300 చేసిన ఆటగాడికి 400 చేయడమెలాగో తెలుసు. అతడికి మరో అవకాశం తప్పక లభిస్తుంది’ అని లారా అన్న సంగతి తెలిసిందే.
వార్నర్ నాది బద్ధలు కొడతాడు
Related tags :