Politics

మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం

Ex TDP Minister Narayana Protested By Student Unions

మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు అనంతపురంలో చెడు అనుభవం ఎదురైంది. అనంతపురంలోని నారాయణ విద్యా సంస్థలను పరిశీలించేందుకు నారాయణ వచ్చిన విషయాన్నీ తెలుసుకున్న విద్యార్ధి సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్ధుల నుంచి లక్షలు రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని నారాయణను నిలదీశారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బంద కూడా విద్యార్ధులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ అడ్డుకున్నారు. దీంతో సిబ్బందికి విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది కళాశాలలపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన నారాయణను విద్యార్ధి నేతలు చుట్టుముట్టారు. ఆయనను ముందుకు కదలనేయకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థల సిబ్బంది విద్యార్ధి నేతల నుంచి నారాయణను తప్పించి తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు. దీంతో తోపులాట జరిగింది. ఈసమయంలో నారాయణ వెళ్ళకుండా అడ్డుకునేందుకు విద్యార్ధి నేతలు ఆయన షార్ట్ పట్టుకున్నారు ఒకానొక దశలో దాడికి సిదమైన పరిస్థితి కనిపించింది. స్పందించిన నారాయణ సిబ్బంది ఆయనను విద్యార్ధి నేతల నుంచి తప్పించి కారు వద్దకు తీసుకెళ్ళారు. ఆయన కారులో కూర్చున్న తరువాత కూడా విద్యార్ధి సంఘాల నాయకులూ శాంతించలేదు. కారును చుట్టుముట్టి రాయితో కారుపై కొట్టారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.