రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని భారత్-అమెరికా దేశాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ నెల 18, 19 తేదీల్లో రెండు దేశాల రక్షణ అధికారులు, పరిశోధకులు, రక్షణ వ్యాపార దిగ్గజాల సదస్సును హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం పేర్కొంది. ది బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్(బీసీఐయూ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రెండు దేశాలు రక్షణ రంగంలో అనుసరిస్తున్న ద్వైపాక్షిక విధానాలు, అమెరికా రక్షణ పరిశ్రమల సహకారం, భాగస్వామ్యంతో తయారీ విధానాలు తదితరాలపై సదస్సులో సమీక్ష జరుగుతుందని వెల్లడించింది.
భారత్-అమెరికా రక్షణ సంబంధాల సదస్సు
Related tags :