Politics

ఏపీలో కొత్త బార్లకు దరఖాస్తులు నిల్లు

Not many applications for new bar licenses in andhra

ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్లకు వ్యాపారుల నుంచి ఏమాత్రం స్పందన కనిపించడం లేదు. లైసెన్సు లకు ఆహ్వానం పలుకుతూ నోటీసులు జారీ చేసిన ఐదు రోజులు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. బార్ లైసెన్స్ కావాలంటే రూ.పది లక్షలు కట్టాల్సి ఉండగా లాటరీలో షాపు తగలకుంటే కట్టిన డబ్బు వెనక్కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈపరిష్టితి వచ్చిందని అధికారులు అంటున్నారు ఇదే సమయంలో బార్ లను నడుపుతున్న పలువురు కోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆగాలని వ్యాపారులు భావిస్తునట్టు తెలుస్తోంది గడువుకు ముందే లైసెన్సులు రద్దు చేసారంటూ వ్యాపారులు కోర్టులు ఆశ్రయించిన సంగతి తెలిసిదే. కోర్టులో కొత్త బార్లకు అనుకూలంగా తీర్పు రాకుంటే డబ్బులు వెనక్కి వస్తాయా? అన్న సందేహంలోనూ వ్యాపారులు ఉన్నారు లైసెన్స్ కోసరం రూ. పది లక్షలు కట్టాల్సి రావడం తమపై భారమేనని అంటునారు కోర్టులో స్పష్టత వచ్చిన తరువాత ముందడుగు వేయాలని భావిస్తున్నారు.