Politics

తెదేపాలో ముంచుకొస్తున్న మరో సంక్షోభం

Telugu Desam In Deep Stress With Jumping Leaders

వైఫల్యం ఎదురైన వేళా .. ఎవరి సత్తా ఎంతన్న విషయంపై అవగాహనా వస్తుంటుంది. అనుకూల పరిస్థితుల్లో ఎవరు ఏమైనా చేస్తుంటారు కానీ ప్రతికూల పరిస్థితిల్లో ఎవరి సత్తా ఎంతన్న విషయం మీద యిట్టె అవగాహనా కలిగేలా చేస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న బాబుకు పవర్ చేజరిపోవటం అప్పటివరకు ఆయన నమ్మిన వారంతా ఒక్కొక్కల్లుగా తమ వారు తాము చూసుకోవడం తెలిసిందే. అదంతా చూసినపుడు ఇలాంటి వారిని బాబు చుట్టూ పెట్టుకున్నారా? అన్న భావన కలుగక మానదు. తన చేతిలో పవర్ ఉన్న వేళ ఆపరేషన్ ఆకర్ష పేరుతొ ధన బలంతో అధికార బలంతో ఒత్తిళ్లలో గురి చేయటం తెలిసిందే ఇష్టానికి విరుద్దంగా బలవంతంగా పార్టీలో చేపిస్తే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయన్నది తాజాగా టీడీపీ పరిస్థితి చూస్తె యిట్టె అర్ధం అవుతుంది ఇదిలా ఉంటె తాజాగా బాబు పార్టీకి చెందిన ముగ్గురు ప్రకాశం జిల్లాకే చెందినా ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టిడీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది ఇందులో చీరాల ఎమ్మెల్యే కారణం బలరాం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పర్చూరు ఎమ్మెల్యే ఏటూరి సాంబశివరావు కొండపి ఎమ్మెల్యే జోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామీ విజయం సాధించారు. ఇదిలా ఉంటె గడిచిన ఆరేళ్లలో విపక్షనేతగా చంద్రబాబు మూటకట్టుకున్న వ్యతిరేకతతో తమ రాజకీయ భవిష్యత్తు మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అందులో వైకాపాకి చెందిన మంత్రి బాలినేని ఇంట్లో సమావేశం కావటం హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. గోతిపాటి రవికుమార్ ను డీల్ చేసేందుకు కొడాలి నాని రంగామోకి దిగారని ఎలూరితో కూడా మంత్రి బాలినేని టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది విపక్ష నేతగా బాబు వ్యవహరిస్తున్న ధోరణిపై తీవ్ర కునుకుతో ఉన్న తమ్ముళ్ళు పార్టీ మరెందుకు తమ పదవుల్ని త్యాగం చేయడానికి సైతం సిద్దమంతున్నారు అన్ని అనుకున్నట్లు సాగితే జగన్ ను గురువారం తెలుగు తమ్ముళ్ళు భేటి కావటమే కాదు.. పార్టీ మారే విషయాన్నీ చర్చిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది.