తిరుమలలో సాగుతున్న మరో అక్రమ టికెట్ల దందాను నిఘా వర్గాలు పట్టేసాయి. ఏపీ ఎమ్మెల్సీ విజయరామరాజు పేరిట ఉన్న సిఫార్సు లేఖలతో కొందరు వ్యక్తులు అదిక ధరలకు సేవ, దర్శనం టికెట్లను పసిగట్టిన అధికారులు దాడి చేసి హేమంత్ కుమార్ అనే దళారిని అరెస్టు చేసారు. సిఫార్సు లేఖను తీసుకుని వచ్చి హేమంత్ కు ఇచ్చే మరో వ్యక్తీ పరారీలో ఉన్నాడని అతనికోసం గాలిస్తున్నామని తెలిపారు. తిరుమలలో టికెట్ల దందాకు చెక్ పెట్టేందుకు ప్రత్యెక టీంలను ఏర్పాటు చేసామని భక్తులు సక్రమ మార్గంలోనే స్వామీ దర్శనానికి వెళ్ళాలని దళారులను నమ్మి కష్టాలు కొని తెచ్చుకోవద్ద్దని టిటిడీ అధికారులు సూచించారు.
ఎమ్మెల్సీ విజయరామరాజు పేరిట తిరుమలలో అక్రమ టికెట్ల దందా
Related tags :