శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతానికి పోలీసులు ముగింపు పలికారు. కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఎన్‌కౌంటర్‌కు గల కారణాలు పోలీసులు గోప్యంగా ఉంచారు. గత నెల 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దిశను కాల్చిన చోటే నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం జరిగిన చోట సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారని, ఈ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.
###########
దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే.
అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు తమ బుద్దిని చూపించి పోలీసులపై దాడికి దిగారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. జైల్లో ఉన్నప్పుడు నిందితులను హై సెక్యూరిటీ మధ్య వేరువేరుగా ఉంచారు. రాత్రి 12గంటల ప్రాంతంలో చర్లపల్లి జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే దిశ సెల్ ఫోన్ గుర్తించేందుకు డీసీపీ సందీప్ రావు నేతృత్వంలోని బృందం అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం నిందితులకు ముందు తెలిసిన ప్రాంతం కావడంతో వారి నేరబుద్ది చూపించారు. ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు.
అనంతరం మిగితా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు. నిందితులు తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించారు. అది వీలుకాకపోవడంతో రాళ్లదాడి చేస్తూ పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. నిందితుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఘటనా స్థలానికి చేరుకుని ఎన్‌కౌంటర్ పై విచారణ చేపట్టారు.