భారత పార్లమెంటు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు క్యాంటీన్‌లో సభ్యులకు అందించే సబ్సిడీ ఆహారంపై హక్కులను వదులుకునేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన బీఏసీ సమావేశంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఇచ్చిన సలహా మేరకు అన్ని పార్టీల ఎంపీలు ఈ సబ్సీడీ విధానాన్ని వదులుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. లోక్‌సభ, రాజ్యసభల సభ్యులకు ఇకనుంచి సబ్సిడీ ఆహారం లభించదని ప్రకటన కూడా చేసినట్లు సమాచారం. ఎంపీలు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సంవత్సరానికి రూ.17కోట్ల వరకు ఆదా కానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు క్యాంటీన్ చేసే ఖర్చులో అక్కడి సభ్యులకు 80శాతం మేర సబ్సిడీ ఇస్తోంది. దీంతో అప్పట్లో బీజేడీ పార్టీకి చెందిన ఎంపీ బైజయంత్ రాయ్ అప్పటి స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విధంగా లేఖ రాశారు. చట్టసభసభ్యులు ఈ క్యాంటీన్ హక్కులను వదులుకోవడం ద్వారా వారు ప్రజావిశ్వాసం పొందటానికి ఇది మంచి దశ అని పేర్కొన్నారు. ఆ తర్వాత కమిటీ ద్వారా నివేదిక పొందిన తర్వాత 2015, డిసెంబర్ 31న లోక్‌సభ పలు నిర్ణయాలతో ఒక ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటు క్యాంటీన్ ప్రస్తుతం ఎలాంటి ఆదాయం గానీ, నష్టం గానీ లేకుండా నడుస్తోంది. అదేవిధంగా కొన్ని ఆహారపదార్థాల ధరలు పెంచాలి.. వాటిని తయారుచేయాడానికి కావల్సిన ప్రాథమిక ధరకు విక్రయించాలని పేర్కొంది.
భారత ఎంపీలు సబ్సిడీ వదిలేసుకున్నారు
Related tags :