చలికాలంలో గొంతునొప్పి బాధల గురించి ప్రత్యేకించి చెప్పడానికేముంది? ఆపై దగ్గు, జలుబు….షరామామూలే! ఉపశమనంగా ఉంటుంది కదాని కప్పు మీద కప్పు టీలు తాగేయొద్ధు ప్రయోజనం ఉండదు. ఈ సమయంలో వంటింటి చిట్కాలే మేలు చేస్తాయి…
* ఈ కాలంలో చిన్నపిల్లలకు ఛాతీలో కఫం పేరుకుపోవడం సహజం. చెంచా వాముని కడాయిలో వేసి దోరగా వేయించండి. వాటిని ఓ పలుచటి వస్త్రంలో మూట కట్టి… పిల్లల ఛాతీపై మృదువుగా కాపడం పెడితే ఆయాసం తగ్గి, ఊపిరి తేలికగా తీసుకోగలుగుతారు.
* గ్లాసు పాలను మరిగించి అరచెంచా మిరియాల పొడి, కొంచెం బెల్లం కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తే, జలుబు నుంచి ఉపశమనం పొందొచ్ఛు మరిగించిన కప్పు నీటిలో చెంచా మిరియాల పొడి వేసి కషాయంలా కాయాలి. దీనికి ఉప్పు కలిపి బాగా పుక్కిలిస్తుంటే టాన్సిల్స్‌కు దూరంగా ఉండొచ్ఛు గొంతు నొప్పి తగ్గుముఖం పడుతుంది.
* కడాయిలో అరచెంచా నెయ్యి వేసి, వేడయ్యాక శొంఠి కొమ్ముని వేయించి చల్లార్చాలి. తరువాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో నెయ్యితోపాటు కలిపి మొదటి ముద్దగా నిత్యం తీసుకోవాలి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
* ఈ కాలంలో కీళ్ల నొప్పులు చికాకుపెడతాయి. అలాంటప్పుడు శొంఠి కొమ్ముని అరగదీసి, ఆ గంధాన్ని కొద్దిగా వెచ్చబెట్టి కీళ్లపై పలుచని పొరలా లేపనం వేసుకోవాలి. ఇలా చేస్తే, నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
* కప్పు నీటిని మరిగించి అందులో చెంచా మెంతులు వేసి టీలా కాచుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు రోజులో మూడు లేదా నాలుగు సార్లు ఈ టీ తాగితే వైరస్ వల్ల శరీరంలో చేరిన మలినాలు బయటకు పోతాయి. జ్వరం త్వరగా తగ్గుముఖం పడుతుంది.
కీళ్లనొప్పుల భరతం పడదాం రండి…
Related tags :