ప్లేబాయ్.. మోడల్స్ నగ్న చిత్రాలతో సంచలనం సృష్టించే టాప్ మ్యాగజీన్. ఈ పత్రిక కవర్ పేజీపై కనబడాలని చాలా మంది మోడల్స్ కోరుకుంటారు. న్యూడ్ ఫొటోషూట్లకూ సై అంటారు. అందుకు ప్రతిగా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటారు. అయితే ప్లేబాయ్ మ్యాగజీన్ నిర్వాహకులు ఇచ్చిన కళ్లు చెదిరే ఆఫర్‌ను బాలీవుడ్ కథానాయిక నర్గీస్ ఫక్రీ తిరస్కరించిందట.తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నర్గీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రఖ్యాత ప్లేబోయ్ కవర్ పేజీ కోసం నగ్నంగా కనిపిస్తే కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ, నేనందుకు అంగీకరించలేదు. తెరపై అందాల్ని ఆరబోయడానికి నేను సిద్ధమే. అయితే అందులోనూ నాకు కొన్ని నిబంధనలున్నాయి. డబ్బు కోసం వాటిని అతిక్రమించలేను. హాలీవుడ్‌తో పోల్చుకుంటే బాలీవుడ్లో స్కిన్‌షో, శృంగారభరిత సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. అందుకే బాలీవుడ్లో అరంగేట్రం చేశానని నర్గీస్ చెప్పింది.
నేను విప్పను
Related tags :