వివాదాస్పద గురువు నిత్యానంద ఇటీవలే ఒక దీవిని కొనుగోలు చేసి, దానిని రాజకీయేతర హిందూ దేశంగా గుర్తించాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి కైలాసం అనే పేరు పెట్టారు. ఈ విషయాలను ఒక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆ దేశానికి ప్రధాని, రాష్ట్రపతితో సహా ప్రత్యేక జెండా, జాతీయ చిహ్నం, పాస్‌పోర్టులు కూడా ఉంటాయని చెప్పారు. ఈ విషయం తెలిసిన టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. నిత్యానందకు ట్విటర్ వేదికగా చురకలంటించాడు. ‘అక్కడికి రావాలంటే వీసా ఎలా తీసుకోవాలి?లేదా వీసా ఆన్ అరైవల్ ఇస్తారా?అని పోస్టు చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిత్యానంద ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. అహ్మాదాబాద్‌లోని తన ఆశ్రమంలో ఇద్దరు విద్యార్థినులు అదృష్యమైన నేపథ్యంలో గుజరాత్ పోలీసులు అతడిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?- పేలుతున్న సెటైర్లు

Related tags :