హహహ నేను భాజాపాతో దూరంగా లేను.. అమిత్ షా అంటే నాకు ఇష్టం.. అలాంటి లీడరు కావాలిప్పుడు అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కలకలం సృష్టించాయి. నిజం చెప్పాలంటే పవన్ప్రాణంగా భావించే తన ప్యాన్స్ లోనే చాలా మంది ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా ఈ బాస్ కు బిగ్ బాస్ గా చెప్పబడే చంద్రబాబు అండ్ కో మాత్రం ఏక దం సైలెన్స్ దొరికాడు మళ్ళీ అన్నట్లుగా ఇక వైకాపా శ్రేణులు దాడికి దిగాయి. తెల్లారేసరికి జగన్ పైనే జగన్ పాలనపైన విరుచుకు పడుతూ ఊళ్ళు తిరుగుతున్నాడు కదా ఇక మొదలు పెట్టేసారు. అన్న కాంగ్రెస్ కు అమ్ముకున్నాడు తమ్ముడు భాజపాకి అమ్మేసుకుంటాడు జెండా పీకేద్దాం.. రెండోసారి ఇది విలీనం కాదు నిమజ్జనం బాబు చెబితేనే టీడీపీ ఎంపీలు భాజపాలోకి వెళ్లారు బాబు చెబితేనే తన బీటీం భాజపాలోకి వెళ్ళబోతుంది. ఇలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పే ఈ మాటల్ని సీరియస్ గా తీసుకోవాలా? అంతటి జీవీఎల్ మహాశయుడు గత ఎన్నికలకు ముందే జనసేనాను భాజపాలో విలీనం చేయాలని అడిగాం. వినలేదు ఇప్పుడు విలీనం చేస్తాడేమో అంటున్నాడు. జీవీఎల్ వంటి ఏపీ నేతలకూ తెలియనంత గోప్యంగా ఎ స్థాయి పెద్దలతో పవన్ తన సంబందాలను ఇన్నేళ్ళుగా మెయింటేన్ చేస్తున్నాడబ్బా ఇదే తరహాలో ఇక రకరకాల విశ్లేషణలు స్టార్టయ్యాయి. అధికారంలోకి వచ్చి ఆదిపత్య పోకడలు చూపిస్తున్న రెడ్లకు ఇక కమ్మ-కాపు కాంబినేషన్ సరైన కౌంటర్.
పవన్ కళ్యాణ్ భాజపా భజన
Related tags :