హవేలీ ఘనపురం మండల పరిధిలోగల పోచారం ప్రాజెక్టులో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి 6 లక్షల 31 వేల రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలను ఇస్తున్నారన్నారు. మూడు సంవత్సరాల నుంచి మత్య్సకారులకు ఉచితంగా చేప పిల్లలను ఇస్తున్నామని పేర్కొన్నారు. మత్స్య కారులు ఆర్థికంగా ఎదగడం కోసం సబ్సిడీ కింద వాహనాలు,మార్కెటింగ్ సదుపాయం కల్పించామన్నారు. ఈ సంవత్సరం మెదక్ నియోజకవర్గంలో చెరువులు నిండుకుండలా ఉన్నాయని గుర్తు చేశారు. రాబోవుకాలంలో మెదక్ లో చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం హవేలి ఘనాపూర్ మండలం లోని చౌటపల్లి గ్రామం లో అంగన్వాడి భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. మెదక్ లోని తెలంగాణ భవన్ లో 46 మంది కి కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ లావణ్య రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్,జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులు నర్సింలు, ఉమ్మడి మండలాల ఎంపిపిలు,జడ్పీటీసీ సభ్యులు,అధికారులు,సర్పంచులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణా రైతులకు పూర్తి సబ్సిడీతో చేపపిల్లలు
Related tags :