సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ (నల్సా) ఛైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణను నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నామినేట్ చేశారు. నవంబరు 27 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ దిల్లీలోని జామ్‌నగర్ హౌస్‌లో నల్సా కార్యాలయాన్ని సందర్శించిన జస్టిస్ ఎన్వీ రమణ .. నల్సా డైరెక్టర్ సునీల్చౌహాన్ సహా ఇతర అధికారులతో మాట్లాడారు. నల్సా భవిష్యత్తు కార్యకలాపాలపై రోడ్ మ్యాప్‌ను విడుదల చేశారు. 1987లో ఏర్పాటైన నల్సా ..పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించటంలో విశేష కృషి చేస్తోంది. 2020లో న్యాయస్థానం ఆధారిత కార్యకలాపాల్లో న్యాయ సేవల నాణ్యత పెంచటంపై నల్సా ప్రధానంగా దృష్టి సారించనుంది.
Read More Here: https://nalsa.gov.in/current-executive-chairman