Food

తాలింపులో ఆవాలు దంచి కొట్టండి

Mustard Seeds Are Must In Your Diet For A Ton Of Health Benefits

భారతీయులు ఎంతో కాలం నుంచి ఆవాలను తమ వంటి ఇంటి దినుసుల్లో భాగంగా ఉపయోగిస్తున్నారు. పోపు వేయాలంటే.. ముందుగా ఎవరికైనా ఆవాలే గుర్తుకు వస్తాయి. అయితే వీటిని పొడి రూపంలో లేదా అలాగే నిత్యం తీసుకుంటే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే ఆవాలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఆవాలలో మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, పాస్ఫరస్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో శరీరానికి పోషణ లభిస్తుంది.

* శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవాలను తింటే ప్రయోజనం ఉంటుంది.

* ఆవాలలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది.

* ఆవాలలో ఉండే కాపర్, ఐరన్, మెగ్నిషియం, సెలీనియంలు హైబీపీని తగ్గిస్తాయి.

* ఆస్తమా ఉన్నవారు ఆవాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

* ఆవాలలో విటమిన్ ఎ, సి, కెలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. శరీర కణజాలాన్ని రక్షిస్తాయి.

* ఫంగస్, ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను తినడం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.