సూర్యుడిపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సం స్థ (నాసా) పంపిన వ్యోమనౌక పార్కర్.. తన పని ప్రారంభించింది. తొలిసారి సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన ఈ వ్యోమనౌక.. తొలి విడుతగా సౌర పవనాలు, సౌర వాతావరణంపై అద్భత సమాచారం భూమికి చేరవేసిందని నాసా తెలిపింది. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే సూర్యుడిపై పలు ప్రశ్నలకు జవాబు లభిస్తుందన్నది. సూర్యుడి చుట్టూ వేల కిలోమీటర్ల మేర గల ‘కరోనా’ ఊష్ణపొరలో సూర్యుడి ఉపరితలంకన్నా ఉష్ణోగ్రత వందల రెట్లు అధికం. కరోనాలో అక్కడక్కడా ఉండే రంధ్రాల నుంచి సౌర తుఫాన్లు వెలుపలికి వస్తుంటాయి. పార్కర్ పంపిన సమాచారాన్ని లోతుగా విశ్లేషిస్తే వీటికి సమాధానాలు దొరుకొచ్చని నాసా తెలిపింది.
పని ప్రారంభించిన పార్కర్
Related tags :