సౌదీ అరేబియాకు చెందిన చమురు రంగ దిగ్గజం ఆరామ్‌కో గురువారం ఐపీవోను ప్రారంభించింది. అత్యధికంగా 32 రియాళ్ల రేటు వద్ద షేరు ధరను నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా 25.6 బిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ మొత్తం చైనాకు చెందిన ఆన్‌లైన్ ట్రేడింగ్ గ్రూప్ అలీబాబా ఐపీవో (25 బిలియన్ డాలర్ల) కంటే ఎక్కువ. ఈ సంస్థ మార్కెట్లోకి ప్రవేశిస్తే దీని విలువ 1.7 ట్రిలియన్ డాలర్లతో అత్యధిక మార్కెట్ విలువ ఉన్న తొలి కంపెనీగా మారుతుంది. ఆ తర్వాత స్థానంలో యాపిల్ (1.2 ట్రిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్, అలీబాబా (ఒక్కోటి 1.1 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఆరామ్‌కో ట్రేడింగ్ డిసెంబర్ 12 నుంచి రియాద్‌లోని తద్వుల్ ఎక్స్‌ఛేంజిలో రియాళ్ల వద్ద ట్రేడింగ్ మొదలవుతుంది. ఈ ఐపీవోలో ఎక్కువ భాగం సౌదీవాసులే కొనుగోలు చేయనున్నారు. మరోపక్క విదేశీ పెట్టుబదిదారులు మాత్రం ఈ కంపెనీ కార్పొరేట్ నిర్వహణ తీరు, కంపెనీ చమురు క్షేత్రాల రక్షణ, పర్యావరణ మార్పులపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరామ్‌కో మార్కెట్లోకి రావడంతో వచ్చే సొమ్ముతో సౌదీ ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడటం తగ్గించుకొనేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ ఐపీవోలో కంపెనీలోని 1.5శాతం వాటాలను మాత్రమే విక్రయిస్తున్నారు.
25.6బిలియన్ డాలర్ల లక్ష్యంతో ఆరాంకో షేర్లు ప్రారంభం
Related tags :