Movies

వండర్ వుమెన్ పాత్ర చేయాలి

Disha Pathani Wants To Be Wonder Woman-వండర్ వుమెన్ పాత్ర చేయాలి

‘లోఫర్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నటి దిశాపటానీ. ఆ తర్వాత ఆమె పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ నటి ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఇందులో భాగంగా.. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోల్లో తనకు టైగర్‌ ష్రాఫ్‌ అంటే ఇష్టమని చెప్పింది. అంతేకాకుండా ‘వండర్‌ ఉమన్‌’ లాంటి చిత్రాల్లో నటించాలని ఉన్నట్లు తెలిపారు. ‘నాకు యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ, నటుడు టామ్‌ క్రూజ్‌ అంటే అభిమానం.’ అని దిశా పటానీ పేర్కొన్నారు. మరి బాలీవుడ్‌లో ఇష్టమైన యాక్షన్‌ స్టార్‌ ఎవరు? అని విలేకర్లు ప్రశ్నించగా.. ‘బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్స్‌లో నాకు టైగర్‌ ష్రాఫ్‌ అంటే ఇష్టం. యాక్షన్‌ సీక్వెన్స్‌ను టైగర్‌ చేసినట్టు మరెవరు చేయలేరు. అలాగే నాకు ‘వండర్‌ ఉమన్‌’ లాంటి సూపర్‌హీరో చిత్రాల్లో నటించాలని ఉంది.’ అని దిశా వివరించారు. దిశాపటానీ, టైగర్‌ ష్రాఫ్‌ ‘బాఘీ 2’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాలో దిశా-టైగర్‌ కెమిస్ట్రీ చూసి చాలామంది వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. అంతేకాకుండా ఆ సినిమా తర్వాత నుంచి వీరిద్దరు కలిసి డిన్నర్లు, పార్టీలకు వెళ్లిన ఫొటోలు సైతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో దిశా-టైగర్‌ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రేమ వార్తలపై ఇప్పటి వరకూ ఈ జంట స్పందించలేదు.